Mecca Air Raid Alert : ఇరాన్, ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య సాగుతున్న యుద్ధం ఈ మధ్య ముగిసేలా కనిపించడం లేదు. అమెరికాకు సాయం చేస్తున్నారనే ఉద్ధేశంతో గత కొంతకాలంగా సౌదీ అరేబియాపై ఇరాన్‌ దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇరాన్‌కు మద్ధతు తెలుపుతున్న యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటు దారులు సౌదీపై విరుచుకుపడుతున్నారు. ఈ తరుణంలో ఇస్లాం పవిత్ర నగరం మక్కాలో తొలిసారి వైమానిక ముప్పు హెచ్చరికలు జారీ కావడం కలకలం రేపింది. సౌదీ అరేబియాపై హూతీలు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు మొదలు పెట్టారు. దీంతో అలర్ట్‌ అయిన సౌదీ మక్కా, జెడ్డా, తాయిఫ్ సహా పలు ప్రాంతాల్లో సౌదీ పౌర రక్షణ విభాగం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడ కొంత అలజడి చెలరేగింది. అయితే కొద్దిసేపటికే మక్కాలో ప్రమాదం తొలగిపోయినట్లు అధికారులు ప్రకటించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల భారీ బాంబుల సరఫరా..

సెప్టెంబర్ 15న మక్కాకు దక్షిణంగా హూతీలు ప్రయోగించిన ఓ డ్రోన్‌ను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుని ధ్వంసం చేసినట్టు సౌదీ ప్రకటించింది. ఆ డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి ప్రవేశించే ముందే కూల్చివేసినట్లు అధికారుల సమాచారం. అయితే మక్కాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను హూతీలు ఖండించారు. హూతీ రాజకీయ విభాగానికి చెందిన హాజెమ్ అల్-అసద్ సౌదీ ఈ ఆరోపణలను ఖండించారు. తాము మక్కాపై ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు.

దీంతో మక్కాలో అత్యవసర హెచ్చరికలకు ముందు రోజు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలపై హూతీలు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో 13 మంది గాయపడ్డారని సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రకటించింది. కాగా, ఈ వారం సౌదీపై హూతీల దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. సౌదీ వైమానిక రక్షణ దళాలు మక్కాకు దక్షిణంగా ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన నగరమైన మక్కాలో వైమానిక ముప్పు హెచ్చరిక వెలువడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Also Read : AIకి కిల్‌ స్విచ్‌.. ప్రమాదం వస్తే పూర్తిగా ఆపేయాల్సిందేనా?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.