
CSK : ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. IPL 2027కు ముందు ఈ మార్పు జరిగింది. ఇప్పటివరకు CSK హెడ్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో జహీర్ ఖాన్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఫ్లెమింగ్ ఇటీవల CSK కోచ్ పదవి నుంచి తప్పుకుని ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
జహీర్ ఖాన్‌కు హెడ్ కోచ్‌గా ఇది మొదటి అవకాశం. ఇంతకుముందు 2018 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 2024 ఆగస్టు నుంచి 2025 సెప్టెంబర్ వరకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు మెంటార్‌గా ఉన్నాడు. 2017లో జహీర్ ఖాన్‌ను తొలుత టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. అప్పట్లో అనిల్ కుంబ్లే హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అయితే అదే ఏడాది రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత జహీర్ బాధ్యతల్లో మార్పు చేశారు. బౌలింగ్ కన్సల్టెంట్‌గా అతడిని కొనసాగించారు.
Also Read : రామ మందిర విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్.. CCTVలో 105 ఘటనలు!
కాగా టీమిండియా తరఫున జహీర్ ఖాన్ 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచిన సమయంలో జహీర్ 21 వికెట్లు తీసి ఆ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2024 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు జహీర్ మెంటార్‌గా కూడా పనిచేశాడు. ఇక స్టీఫెన్ ఫ్లెమింగ్ గత ఏడాది జులైలోనే CSKతో తన ప్రయాణం ముగించనున్నట్లు ప్రకటించాడు. CSK తరఫున అతను 2009 నుంచి 2015 వరకు, ఆ తర్వాత 2018 నుంచి 2026 వరకు రెండు దశల్లో కోచ్‌గా పనిచేశాడు.
ఫ్లెమింగ్ ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఈ ఏడాది జులైలో CSK కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టులో అతను తన మాజీ న్యూజిలాండ్ సహచరుడు బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో బాధ్యతలు చేపట్టాడు. CSK క్రికెట్ మేనేజ్మెంట్లో ఎంఎస్ ధోనీ, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యజమాని రూపా గురునాథ్ ఉన్నారు. ఈసారి భారతీయుడినే కోచ్‌గా నియమించాలని మేనేజ్మెంట్ భావించినట్లు సమాచారం. అందులో భాగంగానే జహీర్ ఖాన్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్..హెల్త్ బెన్ఫిట్స్ పెంపు









