Liquor Shops Closed : గడచిన పది రోజులుగా దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలోనూ ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలు జరుగుతున్నాయి. కాగా, ఈ రోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో నిమజ్జనం నిర్వహించనుండగా, హైదరాబాద్‌లో శుక్రవారం నిమజ్జన కార్యక్రమం ఉండనుంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా మద్యం విక్రయాలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. గణేశ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి గాను మూడు రోజుల పాటు మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు గణేశ నిమజ్జన శోభాయాత్రలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు పోలీసు విభాగం ప్రకటించింది.నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు.. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గణేష్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు రాష్ర్టంలోని అన్ని వైన్‌ షాపులు, బార్లు, క్లబ్‌లను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నిమజ్జనం జరగనున్న తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో ఈ రోజు (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి రేపు (గురువారం) ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు ప్రకటించారు.కాగా, నిమజ్జనం సాఫిగా సాగడం కోసం నిజామాబాద్‌లో మంగళవారం నుంచే వైన్‌ షాపులు క్లోజ్‌ చేశారు.

Also Read : మాదాపూర్‌ ఓయో రూం లో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడిపై అనుమానం

నగరంలో శుక్రవారం

ఇక హైదరాబాద్‌ మహానగరంలో శుక్రవారం గణేష్‌ నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కారణంగా హైదరాబాద్‌ పరిధిలో శుక్రవారం వైన్‌ షాపులు బంద్‌ చేస్తారు. అలాగే మద్యం మత్తులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. గణేశ్‌ విగ్రహాల తుది నిమజ్జనాన్ని పురస్కరించుకుని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ నెల 25న మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు వైన్‌ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయాల్సి ఆదేశించారు. అయితే స్టార్‌ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్‌ క్లబ్బులకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

Also Read : కోకాపేట వేలానికి సింగిల్‌ బిడ్.. రద్దు చేసిన హెచ్‌ఎండీఏ

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.