
Global Shutdown : పశ్చిమాసియా యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ తో పాటు అమెరికా కూడా తీవ్రంగా నష్టపోతున్నది. అయినా ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో ఇరాన్‌ను దెబ్బతీసేందుకు అగ్రరాజ్యం అమెరికా తనకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. అవకాశం చిక్కితే చాలు ఇరాన్ పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా. బుధవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇరాన్ విమానాలు తమ దేశం వదిలి గగనంలో ఎగిరే అవకాశం లేకుండా పోయింది.
Also Read : మూన్ మాదే: ట్రంప్.. చంద్రుడు ఆస్తి ఎవరిది?
ఒకవేళ అమెరికా ఆంక్షలను కాదని ఇరాన్ విమానయాన సంస్థలకు సేవలు అందించడం కొనసాగించే విదేశీ కంపెనీలపై ద్వితీయ (సెకండరీ) ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు అమెరికా హెచ్చరించింది. అమెరికా, ఇరాన్‌ల యుద్ధం ప్రారంభమై ఏడు నెలలు పూర్తవుతుంది. ఈ తరుణంలో అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ‘‘ఇరాన్ విమానాలు ఇకపై ఎయిర్‌పోర్టులకే పరిమితమవుతాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగిన ఇరాన్ విమానాలకు ఇంధనం అందించడం, ల్యాండింగు సేవలు, టికెట్ల అమ్మకం వంటివి చేస్తే ఆయా దేశాలను డాలర్ వ్యవస్థ నుంచి బయటకు గెంటేస్తాం అని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ విమానయాన రంగానికి మద్దతిస్తున్న ఇతర దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటాం’’ అని స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. అమెరికా ఆర్థికమంత్రి చేసిన ఈ ప్రకటన తర్వాత ఇరాక్, జార్జియా, తుర్కియే వంటి దేశాలు ఇరాన్ విమానయాన సంస్థల కార్యకలాపాలను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు వెల్లడించడం గమనార్హం.
Also Read : అమెరికా రూట్లో ఆస్ట్రేలియా.. భారతీయులకు బిగ్ షాక్.. మారిన వీసా రూల్స్ ఇవే!









