AP Cabinet : ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా ఈ కమిషనరేట్లు ఏర్పాటు కానున్నాయి.

Also Read : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో మరో గంటలో భారీ వర్షాలు

ఇక అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల పనులకు రూ.1,548 కోట్లు ఖర్చు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతి ఇన్‌ఫ్రా పనులకు మరో రూ.644.98 కోట్లు కేటాయించేందుకు అంగీకరించింది. అసెంబ్లీ భవనం స్పైర్, రూఫ్, లిఫ్ట్ పనుల కోసం రూ.661 కోట్లు కేటాయించేందుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన ఎల్‌పీఎస్ రైతులకు కనీస యాన్యుటీ అందేలా నిబంధనల్లో మార్పులు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మార్పులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తంగా అమరావతి అభివృద్ధి, పోలీస్ వ్యవస్థలో మార్పులు, రైతులకు సంబంధించిన అంశాలపై క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Also Read : ఏపీలో తీవ్ర విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.