
ఢిల్లీలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. కారణం ఏంటంటే.. సాధారణ ఓటర్లకే కాదు.. దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్.. ఇలా కీలక పదవుల్లో ఉన్న ప్రముఖులకు కూడా ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ఇంతకీ ఈ నోటీసులు ఎందుకు వచ్చాయి? వీళ్ల ఓటు పోయిందా? ఓటర్ల లిస్ట్‌లో పేర్లు తొలగించబోతున్నారా? అదే సమయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య, తల్లిదండ్రులు, కొడుకు.. మొత్తం కుటుంబానికి నోటీసులు రావడం వెనుక కారణం ఏంటి? మరోవైపు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పేరు కూడా డిఫరెన్సెస్ లిస్ట్‌లో కనిపించింది. కానీ ఆమె డిటైల్స్ వెరిఫై చేసిన తర్వాత ఓటరు నమోదు కన్ఫర్మ్ అని ఎన్నికల సంఘం తెలిపింది. అసలు ఈ అన్మ్యాప్డ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్ అంటే ఏమిటి? ఎవరి పేరు ఎందుకు వచ్చింది? పిన్ టూ పిన్ చూద్దాం!
ఢిల్లీలో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది. ఓటర్ల జాబితాను మరోసారి పూర్తిగా వెరిఫై చేసి, ప్రస్తుతం ఉన్న ఓటర్ డిటైల్స్‌ను గతంలో ఉన్న ఎలక్టోరల్ రోల్స్‌తో మ్యాచ్ చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్‌లో కొన్ని పేర్లు పాత ఓటర్ రికార్డ్స్‌తో లింక్ కాలేదు. మరికొన్ని పేర్లలో పేరు, డేట్ ఆఫ్ బర్త్ లేదా ఇతర వివరాల్లో మిస్‌మ్యాచ్ కనిపించింది. అలాంటి ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ నోటీసెస్ జారీ చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో 31.63 లక్షల నోటీసెస్ ఇప్పటికే జెనరేట్ అయ్యాయి. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో దాదాపు 47 లక్షల పేర్లు బయటకు వెళ్లిన తర్వాత ఈ వెరిఫికేషన్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎస్ఐఆర్ నోటీసెస్ అందుకున్న ప్రముఖుల్లో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్ ఉన్నారు. అలాగే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య సునీత ద్వివేదికి కూడా నోటీసెస్ వచ్చాయి. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన భార్య వనిత సూద్, తల్లి కమలేష్ సూద్ పేర్లు కూడా వెరిఫికేషన్‌లో కనిపించాయి. ఇక మాజీ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖడ్, బిజెపి వెటరన్ ఎల్.కె. అద్వానీ, మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎలక్షన్ కమిషనర్ ఎస్.ఎస్. సంధూ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఎస్ఐఆర్ డిఫరెన్స్ లిస్ట్‌లో ఉన్నట్లు రిపోర్ట్స్ వెల్లడించాయి.
Also Read : UPI చెల్లింపులపై కొత్త ఛార్జీలు.. చిన్న వ్యాపారులకు ఊరట: NPCI క్లారిటీ
మీ కరెంట్ ఓటర్ డిటైల్స్‌ను ఎలక్షన్ కమిషన్ పాత ఎలక్టోరల్ రోల్‌తో మ్యాచ్ చేస్తుంది. పాత రికార్డ్‌లో ఉన్న వివరాలతో కరెంట్ డిటైల్స్‌ను లింక్ చేయడం సాధ్యం కాకపోతే… ఆ ఓటర్ను “అన్మ్యాప్డ్” కేటగిరీలో గుర్తిస్తారు. “మీ కరెంట్ ఓటర్ రికార్డ్‌ను ప్రీవియస్ ఎలక్టోరల్ రోల్‌తో లింక్ చేయడానికి మాకు సరిపడా ఇన్ఫర్మేషన్ కనిపించలేదు. మీరు అడిషనల్ డిటైల్స్/డాక్యుమెంట్స్ ఇవ్వండి” అనే వెరిఫికేషన్ స్టెప్ ఇది. అందుకే నోటీస్ రావడం అంటే వెంటనే పేరు ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ చేసినట్టు కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. నోటీస్ ఇష్యూ చేయడం ఆటోమేటిక్ డిలీషన్ కాదు. ప్రాపర్ వెరిఫికేషన్, హియరింగ్, అప్లికేబుల్ ప్రొసీజర్ తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుంది.
ఇక ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూలో పొలిటికల్ అటెన్షన్ తెచ్చిన మరో పేరు… అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్ అయిన కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుటుంబంలోని మరో నలుగురికి కూడా ఎస్ఐఆర్ నోటీసెస్ వచ్చాయి. అంటే కేజ్రీవాల్, ఆయన భార్య సునీత కేజ్రీవాల్, తండ్రి గోవింద్ రామ్ కేజ్రీవాల్, తల్లి గీతా దేవి, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్ మొత్తం ఐదుగురికి నోటీసెస్ వచ్చాయి. వీళ్లను కూడా “అన్మ్యాప్డ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్” కేటగిరీలో గుర్తించారు. న్యూ ఢిల్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఒక స్పెసిఫిక్ పోలింగ్ పార్ట్‌లో మొత్తం 110 మందికి నోటీసెస్ జారీ కాగా, అందులో కేజ్రీవాల్ ఫ్యామిలీకి చెందిన ఈ ఐదుగురు కూడా ఉన్నారు. న్యూ ఢిల్లీ ఈఆర్ఓ ఎక్స్ప్లనేషన్ ప్రకారం… కేజ్రీవాల్ ఫ్యామిలీ సబ్మిట్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్స్‌లో, వారి రాష్ట్రాల్లోని ప్రీవియస్ ఎలక్టోరల్ రోల్స్‌తో లింకేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైన డిటైల్స్ లేవు. అందుకే నోటీస్ ఇచ్చి… నెసెసరీ డాక్యుమెంట్స్, ఎక్స్ప్లనేషన్ సబ్మిట్ చేయాలని కోరారు.
ఇక్కడే పొలిటికల్ కాంట్రవర్సీ మొదలైంది. కేజ్రీవాల్ ఫ్యామిలీకి నోటీసెస్ రావడంతో ఆప్ ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నించింది. మూడు సార్లు ఢిల్లీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేసిన కేజ్రీవాల్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఓటర్ రికార్డ్స్‌లో “అన్మ్యాప్డ్”గా ఎలా ఉంటాయని ఆప్ ప్రశ్నించింది. ఆప్ ఈ చర్యపై పొలిటికల్ మోటివేషన్ ఉందనే అలిగేషన్ వ్యక్తం చేసింది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ మాత్రం… నోటీసెస్ను ఎస్ఐఆర్ ప్రొసీజర్‌లో భాగంగా జారీ చేస్తున్నామని చెబుతోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ పాయింట్… ప్రస్తుత ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా పేరు కూడా డేటా మ్యాచ్ కాని లిస్ట్‌లో కనిపించింది. ఆమెకు ఏజ్-రిలేటెడ్ డిస్క్రిపెన్సీపై నోటీస్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానీ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే… ఆమె డాక్యుమెంట్స్, డిటైల్స్ వెరిఫై చేసిన తర్వాత ఎలక్టోరల్ ఎంట్రీని అధికారులు వ్యాలిడేట్ చేశారు. అంటే ఆమె పేరు ఫైనల్ ఎలక్టోరల్ రోల్లో ఇన్క్లూడ్ చేయడానికి ప్రాసెస్ కొనసాగుతోంది. షాలీమార్ బాగ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఫైనల్ రోల్ నవంబర్ 4న పబ్లిష్ చేయాల్సి ఉంది.
Also Read : రామ మందిర విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్.. CCTVలో 105 ఘటనలు!
ఢిల్లీ ఎస్ఐఆర్ ప్రాసెస్‌లో భాగంగా 31లక్షల 63వేల 930 నోటీసెస్ జెనరేట్ అయ్యాయని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫీస్ వెల్లడించింది. ఇందులో రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి… అన్మ్యాప్డ్ ఓటర్స్ — అంటే ప్రీవియస్ ఎస్ఐఆర్ ఎలక్టోరల్ రోల్‌తో కరెంట్ రికార్డ్‌ను లింక్ చేయలేకపోయినవారు. రెండోది… లాజికల్ డిఫరెన్స్ ఉన్న ఓటర్స్ — అంటే రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నా పేరు, డేట్ ఆఫ్ బర్త్ లేదా ఇతర డిటైల్స్‌లో మిస్‌మ్యాచ్ కనిపించినవారు. ఈ నోటీసెస్ అందుకున్నవాళ్లు సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కి రిప్లై ఇవ్వాలి. వారు అడిగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అవసరమైతే ఎలక్షన్ అఫీషియల్స్ నిర్వహించే క్యాంప్స్లో తమ కేస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు.
డోర్-టూ-డోర్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ జూన్ 30 నుంచి ఆగస్టు 17 వరకు జరిగింది. ఈ టైంలో ఢిల్లీ ఎలక్టర్స్‌లో దాదాపు 67.18 శాతం మందికి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ రిసీవ్ చేసి డిజిటలైజ్ చేసినట్లు అఫీషియల్స్ తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 31న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ అయింది. ఆ డ్రాఫ్ట్‌లో దాదాపు 47 లక్షల పేర్లు కనిపించలేదు. ఇప్పుడు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్టేజ్ నడుస్తోంది. తమ పేరు లేదా డిటైల్స్ విషయంలో ఇష్యూ ఉందని భావించే ఓటర్స్ డాక్యుమెంట్స్‌తో కరెక్షన్ కోసం అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. సెప్టెంబర్ 30 వరకు క్లెయిమ్స్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఫైనల్ ఎలక్టోరల్ రోల్ మాత్రం నవంబర్ 4, 2026న పబ్లిష్ చేయాల్సి ఉంది.
ఎస్ఐఆర్ నోటీస్ వచ్చింది అంటే మీ వోట్ పోయిందని కాదు. ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ప్రకారం నోటీస్ అనేది వెరిఫికేషన్ ఆపర్చునిటీ. మీ డిటైల్స్‌లో మిస్‌మ్యాచ్ ఉంటే… మీరు రిప్లై ఇవ్వాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అవసరమైతే విచారణలో పాల్గొనాలి. ఆ తర్వాత ఎలక్టోరల్ ఎంట్రీపై డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఢిల్లీ ఎస్ఐఆర్లో ఇప్పుడు జరుగుతున్నది కేవలం వివిఐపిలకు నోటీసెస్ ఇచ్చిన స్టోరీ కాదు. ఇది అసలు ఓటర్ డేటాబేస్ ఎంత ఆక్యురేట్‌గా ఉంది? కరెంట్ ఓటర్ రికార్డ్‌ను ప్రీవియస్ రికార్డ్స్‌తో ఎలా మ్యాప్ చేస్తున్నారు? మిస్‌మ్యాచ్ వచ్చినప్పుడు ఓటర్‌కి ఏ అవకాశం ఇస్తున్నారు? అనే పెద్ద వెరిఫికేషన్ ఎక్సర్సైజ్. జైశంకర్ నుంచి జనరల్ ఉపేంద్ర ద్వివేది వరకు… సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఫ్యామిలీ వరకు… రేఖా గుప్తా వరకు… ప్రముఖుల పేర్లు కూడా స్క్రూటినీలోకి రావడంతో ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్‌పై దేశవ్యాప్తంగా అటెన్షన్ పెరిగింది. అందుకే ఇప్పుడు అసలు చూడాల్సింది… ఈ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్‌లో ఎంతమంది పేర్లు తిరిగి ఉంటాయి? ఎంతమంది రికార్డ్స్ కరెక్ట్ అవుతాయి? అదే ఈ ఎస్ఐఆర్లో నెక్స్ట్ మూవ్మెంట్.









