Telangana Weather Update
Telangana Weather Update

బంగాళాఖాతంలో మరో తీవ్ర వాయు గుండం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది రాబోయే 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం అండమాన్‌లోని మాయాబందర్‌కు తూర్పు ఈశాన్యంగా దాదాపు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం, ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ రాబోయే 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.

Also Read : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. పొంగిపొర్లుతున్న వాగులు!

రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇటీవల కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం వల్ల తీవ్రంగా శ్రీకాకుళం నష్టపోయింది. మళ్లీ ఆ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని మన్యం, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే వీలుంది.

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల తీరప్రాంతం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండటంతో పాటు నగర, గ్రామీణ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. అటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని అధికారులు హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read : బీజేపీలో కీలక మార్పులు.. తెలుగు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జీలు!