
South Korea vs Ukraine : రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ఇద్దరు ఉత్తరకొరియా సైనికులను పట్టుకున్నామని, వారిని దక్షిణకొరియా కు అప్పగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ఇటీవల ఐరాస లో ప్రకటించడం వివాదస్పదమైంది. అయితే జెలెన్స్కీ ప్రకటనపై దక్షిణకొరియా ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.ఈ విషయమై ఉక్రెయిన్ తమకు క్షమాపణలు చెప్పాలని ఆ దేశం డిమాండ్ చేసింది.
అయితే యుద్ధ ఖైదీల అప్పగింత విషయంపై తమకు ఉక్రెయిన్‌కు మధ్య రహస్య ఒప్పందం ఉందని దక్షిణకొరియా చెబుతోంది. ఈ ఒప్పందం ప్రకారం.. యుద్ధ ఖైదీల అప్పగింత విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాలి. కానీ రష్యా తరఫున పోరాడుతూ ఉక్రెయిన్ దళాలకు చిక్కిన ఇద్దరు కిమ్ సైనికులను దక్షిణకొరియాకు అప్పగించినట్లు ఇటీవల జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల్లో ఉక్రెయిన్ జెలెన్స్కీ వెల్లడించడం తీవ్ర వివాదానికి కారణమైంది.
సైనిక రహస్యాలను దేశాలకు సంబంధించిన గోప్యతా అంశాలను బహిరంగంగా వెల్లడించడం రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని దక్షిణకొరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఏకపక్షంగా ప్రకటన చేయడమేకాకుండా తమ రెండు దేశాల మధ్య అలాంటి రహస్య ఒప్పందమేమీ లేదని జెలెన్స్కీ వెల్లడించడంపై తాము తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నామని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలు, మానవతా సూత్రాలకు లోబడి సైనికుల బదిలీని రహస్యంగా ఉంచడమే ఈ ఒప్పందం ఉద్దేశమని దక్షణ కొరియా స్పష్టం చేసింది. సైనికుల వివరాలు బహిర్గతమైతే స్వదేశంలోని వారి కుటుంబాల భద్రతకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఇదిలావుంటే 2025 జనవరిలో రష్యాకు చెందిన కర్స్క్ ప్రాంతంలో నుంచి ఇద్దరు ఉత్తరకొరియా సైనికులను జెలెన్స్కీ సైన్యం బందీలుగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆ ఇద్దరు సైనికులు దక్షిణకొరియాకు వెళ్తామని ప్రాధేయపడటంతో ఈ అప్పగింత జరిగినట్లు తెలుస్తోంది.









