
Asian Games 2026 : ఆసియా గేమ్స్ 2026లో భారత్ అదరగొడుతోంది. 11వ రోజు భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఆర్చరీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో బంగారు పతకం సాధించింది. ఫైనల్లో చైనాను 238-234 తేడాతో ఓడించింది. ఈ క్రమంలో దక్షిణ కొరియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా భారత్ సమం చేసింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్లో జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక త్రయం చైనాను ఓడించి పసిడిని దక్కించుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు తెలుగు అమ్మాయిలు కావడం విశేషం.
Also Read : ATM నుంచి గ్యాస్ వరకు.. అక్టోబర్1 నుంచి కొత్త రూల్స్
Also Read : ఆ నరరూప రాక్షసుడు ఖతం.. పహల్గామ్ హంతకుడు హతం!









