
Smit Machchhar : దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్నే ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఫ్లై దుబాయ్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తోంది. విమానం గాల్లో ఉన్న సమయంలో ఇద్దరు పైలట్ల మధ్య గొడవ జరగగా, ఈ సమయంలో కో-పైలట్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దాడి చేశాడు. దాడిలో స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు.
అదే సమయంలో విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం విమానం సుమారు 14 వేల అడుగులు కేవలం కొన్ని సెకన్లలోనే దిగిపోయింది. విమానంలో జరిగిన అనూహ్య దాడిలో తీవ్రంగా గాయపడినా పరిస్థితిని ఎదుర్కొని, కాక్‌పిట్ తలుపు తెరవడానికి చేసిన స్మిత్ మచ్చర్ ప్రయత్నం కీలకంగా మారింది. 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ఇప్పుడు ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది.
ఈ ఘటనలో హీరోగా నిలిచిన భారత పైలట్ స్మిత్ మచ్చర్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. దీంతో స్మిత్ మచ్చర్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు ఆయన పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వీడియోలు పెట్టారు.స్మిత్ మచ్చర్ పేరు గుర్తుపెట్టుకోండి అంటూ కొందరు పోస్టులు చేశారు. భారత పైలట్ చూపించిన ధైర్యానికి ధన్యవాదాలు చెబుతూ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్మిత్ మచ్చర్‌ను ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపించిన ధైర్యం గొప్పదని మోదీ పేర్కొన్నారు. స్మిత్ చర్యల వల్ల వందలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయని, ఒక పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read : 174 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్.. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?
Captain Smit Machchhar is a HERO.
In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others.
His valour helped save hundreds of lives and avert a great tragedy.
India is proud of…
— Narendra Modi (@narendramodi) October 1, 2026
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించారు. కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన ఎదురుదాడి చేశారని, కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం కల్పించారని చెప్పారు. ఆయన చర్యల వల్ల 174 మంది ప్రాణాలు కాపాడబడ్డాయని నెతన్యాహు పేర్కొన్నారు.
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air…
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) September 30, 2026
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్మిత్ మచ్చర్‌ను హీరోగా అభివర్ణించారు. కత్తితో దాడి జరిగినప్పటికీ స్మిత్‌కు విమానాన్ని అదుపులోకి తీసుకునే పరిస్థితి కల్పించేందుకు కాక్‌పిట్ తలుపు తెరవగలిగేంత అవగాహన ఉందని ట్రంప్ అన్నారు. అయితే తాను చెబుతున్న వివరాలు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నుంచి తెలుసుకున్నవేనని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read : సిలికాన్ వ్యాలీలో కలకలం.. 100 మందికి పైగా పేర్లతో రహస్య జాబితా
#WATCH | Trump Hails Indian Pilot Smit Machchhar as “Hero”
US President Donald Trump praises Indian pilot Captain Smit Machchhar for fighting back despite being stabbed, opening the cockpit door and helping save many lives during the Flydubai incident. pic.twitter.com/O1MuLnU3MP
— Organiser Weekly (@eOrganiser) October 1, 2026
స్మిత్ మచ్చర్‌కు విమానయాన రంగంలో కూడా మంచి అనుభవం ఉంది. ఆయన 2022లో ఫ్లై దుబాయ్‌లో చేరారు. అంతకుముందు స్పైస్‌జెట్‌లో సుమారు 11 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ప్రొఫైల్ ప్రకారం బోయింగ్ 737 విమానాల్లో దాదాపు 9,750 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. స్పైస్‌జెట్‌లో కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతల్లో కూడా ఆయన పనిచేశారు.









