
Yuzvendra Chahal : టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు జట్టులో ఆడాలన్న తన కల ఇక నెరవేరే అవకాశం లేదని భావించిన చహల్.. రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే వన్డేలు, టీ20ల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. చహల్ భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. కానీ 17 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఒక్కసారి కూడా టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం అతనికి రాలేదు. 2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌నే భారత్ తరఫున అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్.
Also Read : ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉద్రికత్త.. 700 మంది అరెస్ట్!
తన రిటైర్మెంట్ గురించి చహల్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు. నేను తొలిసారి క్రికెట్ బంతిని పట్టుకున్నప్పుడు నా వయసు 10 ఏళ్లు. అది రెడ్ బాల్. అప్పట్లో ఈ ఆటను ఇంతగా ప్రేమిస్తానని నాకు తెలియదు. రెడ్ బాల్ క్రికెట్ నాకు కేవలం మరో ఫార్మాట్ కాదు. ఓపిక, కష్టం, పట్టుదల అంటే ఏంటో నేర్పింది అని చెప్పాడు.
లార్డ్స్‌లో నా చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాను. ఈ మాటలు చెప్పడం చాలా బాధగా ఉంది. టెస్టు క్యాప్ అందుకోవడం ఎప్పటినుంచో నా కల. ఎన్నో ఏళ్లుగా ఆ కలను నాతోనే తీసుకెళ్లాను. అది నెరవేరలేదు. అయినా నా ప్రయాణం గురించి నేను సంతోషంగా ఉన్నాను. నాకు వచ్చిన ప్రతి అవకాశానికి కృతజ్ఞుడిని అని చహల్ పేర్కొన్నాడు. 2009లో హర్యానా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిన చహల్.. మొత్తం 49 మ్యాచ్‌ల్లో 148 వికెట్లు తీసుకున్నాడు. అతని బౌలింగ్ సగటు 32.27గా ఉంది. అయితే రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రం రిటైర్మెంట్ ఇవ్వడం లేదని చహల్ స్పష్టం చేశాడు.
2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో చహల్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా చహల్ రికార్డు సాధించాడు.
Also Read : సీఈసీ వర్సెస్ జెన్-జెడ్.. గాంధీ మార్గంలో సీజేపీ వినూత్న నిరసన!









