
Rohit Sharma : భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఓపెనర్‌గా 10 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్ కూడా అతడే. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ ఈ మైలురాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 10వేల పరుగులు చేసిన ఓపెనర్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు సచిన్ పేరిట ఉండేది. క్రికెట్ దిగ్గజం 214 ఇన్నింగ్స్‌ల్లో పూర్తి చేయగా.. రోహిత్ 202 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకొన్నాడు.
Also Read : అమిత్ షానే మా నెక్ట్స్ టార్గెట్.. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఓపెన్ ఛాలెంజ్
రెండో వన్డే ముగిసే సమయానికి ఓపెనర్‌గా రోహిత్ ఖాతాలో 9,998 పరుగులు ఉన్నాయి. దీంతో 10 వేల పరుగుల మార్క్ చేరుకోవడానికి కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. మూడో వన్డేలో ఆ రెండు పరుగులు పూర్తి చేయడంతో రోహిత్ అరుదైన జాబితాలోకి చేరాడు. ఇప్పటివరకు ఓపెనర్‌గా వన్డేల్లో 10 వేలకుపైగా పరుగులు చేసిన బ్యాటర్లలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ స్టార్ సనత్ జయసూర్య, వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ క్రిస్ గేల్ ఉన్నారు. ఇప్పుడు రోహిత్ కూడా వారి సరసన చేరాడు. కానీ రోహిత్ శర్మ 92 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి నెలకొల్పిన చిరస్మరణీయమైన 137 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 27 ఓవర్ల తర్వాత భారత్ 152/3 స్కోరుతో ఉంది.
వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 15,310 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 1994 నుంచి 2012 వరకు 344 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ ఈ పరుగులు చేశాడు. సనత్ జయసూర్య 383 ఇన్నింగ్స్‌ల్లో 12,740 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 274 ఇన్నింగ్స్‌ల్లో 10,179 పరుగులతో తన కెరీర్‌ను ముగించాడు. రోహిత్ శర్మ ఈ మైలురాయిని 203 వన్డేల్లో ఓపెనర్‌గా ఆడుతూ అందుకున్నాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో తన స్థానాన్ని మరింత బలపర్చుకున్నాడు.
కాగా మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత్‌కు పేలవమైన ఆరంభం లభించింది. శుభ్‌మన్ గిల్ 1 పరుగుకే అవుటవగా, విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.
Also Read : చైనా చిత్తు.. భారత మహిళల హాకీ జట్టుకు ఏషియన్ గేమ్స్ గోల్డ్!









