Road Accident :  అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లా వాసి మృతి చెందారు. మరిపెడ మండల కేంద్రానికి చెందిన దారం సుప్రియ (31) మిస్సోరి రాష్ట్రంలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఓ ట్రక్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో సుప్రియ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్‌ ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సుప్రియ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అదే కారులో ప్రయాణిస్తున్న భారత్‌కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

సుప్రియ మృతితో స్వగ్రామమైన మరిపెడలో విషాదం నెలకొంది. ఆమె భర్త కొదుమూరి రంజిత్‌, అత్తమామలు కొదుమూరి వెంకటేశ్వర్లు, రాధిక మహబూబాబాద్‌ పట్టణంలోని వీరభద్ర అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహాన్ని భారత్‌కు తరలించే ప్రక్రియపై కుటుంబ సభ్యులు సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.