Vivo T5 Pro 5G Price & Offers
Vivo T5 Pro 5G Price & Offers

Flipkart Sale 2026లో వివో ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. అదే Vivo T5 Pro 5G ఫోన్. ఈ పండుగ సేల్, బ్యాంక్ ఆఫర్లతో దీనిని తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో అతిపెద్ద బ్యాటరీని అందించారు. ఇప్పుడు Vivo T5 Pro 5G ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

Vivo T5 Pro 5G Price & Offers

Flipkart లో Vivo T5 Pro 5Gలోని 6జిబి+128జిబి స్టోరేజ్ వేరియంట్ రూ.49,999లకి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సేల్‌లో భారీ తగ్గింపుతో కేవలం రూ.36,999లకు అందుబాటులో ఉంది. అలాగే సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొంటే రూ.1,850 తగ్గింపు లభిస్తుంది. అంటే దీని ప్రారంభ ధరతో పోలిస్తే.. Vivo T5 Pro 5G ఫోన్‌పై రూ.14,850 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.

Vivo T5 Pro 5G Specifications

Vivo T5 Pro 5Gలో 2392×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ట ప్రకాశంతో కూడిన 6.83-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 9020mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6 పై నడుస్తుంది. వివో టి5 ప్రో 5జి వెనుక భాగంలో IOS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇందులో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.