Deepika Padukone and Ranveer Singh second daughter name is Devi
Deepika Padukone and Ranveer Singh second daughter name is Devi

బాలీవుడ్‌లో అత్యంత ఫేమస్ అయిన జంటలలో ఒకరైన దీపికా పదుకోన్, రణవీర్ సింగ్ దసరా పండుగ సందర్భంగా తమ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించారు. విజయదశమి పవిత్రమైన రోజున ఈ లవ్ కపుల్ తమ రెండో కుమార్తె ఫొటోను తొలిసారిగా పంచుకున్నారు. దీంతోపాటు వారు.. తమ కుమార్తె పేరును కూడా అఫీషియల్‌‌గా వెల్లడించారు. ఈ శుభ సందర్భంలో దీపికా, రణవీర్ అందరి దృష్టిని ఆకర్షించారు.

చిన్నారికి ‘‘దేవి పదుకోన్ సింగ్’ అని పేరు పెట్టారు. ఈ మేరకు ఈ విషయాన్ని తెలియజేస్తూ వారు తమ ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. అందులో దీపికా, రణవీర్, వారి పెద్ద కుమార్తె దువా, చిన్న కుమార్తె దేవి గోల్డెన్ కలర్ డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. అందులో దీపిక తన చిన్న కుమార్తెను తన ఒడిలో పెట్టుకుని కనిపించింది. పక్కనే పెద్ద కుమార్తె దువా తన చెల్లిని ముద్దుపెట్టుకుని ఉండగా.. రణ్‌వీర్ సింగ్ తన ఇద్దరు కుమార్తెలను చూస్తూ నవ్వుతూ కనిపించారు. ఈ నలుగురి ఫ్యామిలీ ఫోటో చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

ఇదిలా ఉంటే రణ్‌వీర్-దీపిక దంపతుల చిన్న కుమార్తె దేవి పేరుకు అర్థాన్ని అభిమానులు ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నారు. ఇప్పుడు ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో దేవి అంటే.. దుర్గాదేవి లేదా దైవశక్తి అని అర్థం. ఈ పేరు శక్తి, సానుకూలత, మంచితనానికి ప్రతీక. నవరాత్రి దసరా పండుగ వేళ ఈ పేరును ప్రకటించడం విశేషం.