
TG Holidays : బాసర రాజీవ్ గాంధీ జ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. దసరా పండుగ సెలవులు ముగిశాక శుక్రవారం నుంచి క్యాంపస్‌కు వెళ్లాలని భావించిన వేలాది మంది విద్యార్థులకు నిరాశే ఎదురైంది. దసరా సెలవుల తర్వాత రీఓపెన్ కావాల్సిన ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు సెలవులను మరికొద్ది రోజుల పాటు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Also Read : స్విగ్గీ, జొమాటోలకు దిమ్మతిరిగే షాక్: జియోమీల్స్ యాప్ రెడీ.. రెస్టారెంట్ ధరలకే కడుపు నిండా భోజనం..!
సెలవులను పొడిగించడానికి ముఖ్య కారణం తీవ్రమైన నీటి కొరత ఉండటం. ఈ ఏడాది పడిన ఎల్ నినో ప్రభావం వల్ల సరైన వర్షాలు కురవకపోవడంతో బాసర పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. క్యాంపస్ సమీపంలోని చెరువులు ఎండిపోవడం, భూగర్భ జలాలు బాగా అడుగంటిపోవడంతో ఈ నీటి కటకట మొదలైంది. దసరా సెలవులకు ముందు నుంచే ఈ సమస్య ఉన్నప్పటికీ అధికారులు ఎలాగోలా నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో దాదాపు 9 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరి రోజువారీ అవసరాలకు, హాస్టళ్లకు కలిపి రోజుకు కనీసం 25 లక్షల లీటర్ల నీరు అవసరం అవుతుంది. కానీ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది మాత్రం కేవలం 15 లక్షల లీటర్లు మాత్రమే. ఒకవేళ క్యాంపస్‌ను తిరిగి ప్రారంభిస్తే రోజుకు ఏకంగా 10 లక్షల లీటర్ల నీటి కొరత ఏర్పడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు.
ఈ నీటి సంక్షోభం నుంచి బయటపడటానికి దసరా సెలవులను పొడిగించడం తప్ప మరో దారి అధికారులకు కనిపించలేదు. నీటి సరఫరాను పూర్వస్థాయికి తెచ్చేందుకు యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గోదావరి నది నుంచి నేరుగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు నీటిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజూ కావాల్సిన 25 లక్షల లీటర్ల నీరు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే మళ్లీ తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. పండగ పూట దంచుడే దంచుడు!









