సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న అనిరుధ్ రవిచందర్(Rockstar Anirudh) పేరు మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది. కేవలం తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న వార్తలతో ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. ముఖ్యంగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ అయిన కావ్య మారన్‌తో అనిరుధ్ వివాహం నిశ్చయమైందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నవంబర్ 21న చెన్నైలో జరగనున్న వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించి ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందుతుండటంతో ఈ క్రేజీ జోడీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

Also Read : విజయ్ దేవరకొండ స్టార్ మ్యాజిక్.. ‘రణబాలి’కి భారీ కలెక్షన్స్..!

ఈ నేపథ్యంలో అనిరుధ్ కెరీర్‌లో తాను తీసుకున్న ఫస్ట్ శాలరీ ఎంతని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చెన్నైలోని ఒక ప్రముఖ కళా కుటుంబం నుండి వచ్చినప్పటికీ, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మేనల్లుడైనప్పటికీ.. అనిరుధ్ తన కెరీర్ మొదట్లో కేవలం పాకెట్ మనీ కోసం, మ్యూజిక్ పై ఉన్న ప్యాషన్‌తో చిన్న చిన్న ప్రాజెక్టులు చేశారు. ఆయన కెరీర్‌ను పూర్తిగా మర్చిన మలుపు ధనుష్ హీరోగా నటించిన ‘3’ సినిమా. ఆ చిత్రంలోని “వై దిస్ కొలవెరి డి..” సాంగ్ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో రికార్డులు బ్రేక్ చేసిన ఈ ఒక్క పాటే అనిరుధ్‌ను ఓవర్ నైట్ నేషనల్ స్టార్‌గా మార్చేసింది.

అయితే ఈ సినిమాకు రాకముందు అనిరుధ్ తన మొదటి ప్రాజెక్ట్ లేదా జింగిల్స్ కోసం పనిచేసినప్పుడు అందుకున్న మొట్టమొదటి రెమ్యూనరేషన్ కేవలం కొన్ని వేల రూపాయలు మాత్రమే. కాలేజ్ రోజుల్లో స్నేహితులతో కలిసి షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ కోసం మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు వచ్చే ఆ చిన్న మొత్తమే తన తొలి సంపాదన అని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. డబ్బు కంటే మ్యూజిక్ మీద ఉన్న పిచ్చె ఆయనను ఇంత దూరం తీసుకొచ్చింది.

అలా కేవలం కొన్ని వేలతో ప్రయాణం మొదలుపెట్టిన అనిరుధ్.. నేడు ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు. రజినీకాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ వంటి టాప్ స్టార్స్ సినిమాలకి బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందిస్తూ దూసుకుపోతున్న ఆయన.. ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త కావ్య మారన్‌తో కలిసి జీవితంలో మరో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నారు. మ్యూజిక్ ప్రపంచాన్ని శాసిస్తున్న రాక్ స్టార్, బిజినెస్ వరల్డ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కావ్య మారన్ జోడీ నిజంగానే పర్‌ఫెక్ట్ కాంబినేషన్ అని అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Also Read : రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా షురూ.. టైటిల్ అదిరింది.. స్టోరీ ఏంటంటే..?