
ADAS For Cars : హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు ముందున్న వెహికల్ సడన్‌గా బ్రేక్ వేసినా, రోడ్డుపై అనుకోకుండా ఏదైనా అడ్డంకి వచ్చినా డ్రైవర్ స్పందించేలోపే ప్రమాదాలు జరిగిపోతుంటాయి. కేవలం ఒక్కటంటే ఒక్క సెకను ఆలస్యమైనా అది ఘోర రోడ్డు యాక్సిడెంట్‌కు దారితీస్తుంది. ఇలాంటి డేంజరస్ పరిస్థితులను ముందే పసిగట్టి కంట్రోల్ చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్యాసింజర్ కార్లలో అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది.
Also Read : డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు: కొత్త కలర్ కోడింగ్, సేఫ్ డ్రైవింగ్ టెస్ట్!
అసలు ఏమిటీ AEBS? ఇది ఎలా పనిచేస్తుంది?
AEBS అనేది కార్లలో ఉండే ఒక అత్యాధునిక సేఫ్టీ టెక్నాలజీ. ఇది కారు ముందు భాగంలో ఉండే కెమెరాలు, రాడార్ల ద్వారా రోడ్డును కంటిన్యువస్‌గా మానిటర్ చేస్తుంది. ముందున్న కారుకి, మన కారుకి మధ్య ఉన్న దూరం, స్పీడ్‌ను ఈ సిస్టమ్ ఎప్పటికప్పుడు లెక్కిస్తుంది. ముందున్న వాహనం హఠాత్తుగా ఆగిపోయినా లేదా కొలిజన్ (ఢీకొనే) ఛాన్స్ ఉన్నా వెంటనే డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. ఒకవేళ హెచ్చరించినా డ్రైవర్ తగిన సమయంలో స్పందించకపోతే, AEBS సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. దీనివల్ల ప్రమాదం పూర్తిగా నివారించబడుతుంది, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కారు ఢీకొన్నా స్పీడ్ బాగా తగ్గి తీవ్ర నష్టం జరగకుండా ప్రాణాలు కాపాడుతుంది.
Also Read : సైన్యంలోకి ‘నాగాస్త్ర-2’ డ్రోన్లు.. తేజస్ Mk1Aకు GE ఇంజిన్ల జోరు!
అమలు ఎప్పటినుంచి?
కేంద్రం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం దీని డెడ్‌లైన్స్ ఇలా ఉన్నాయి:
అక్టోబర్ 1, 2028: AEBS ఉన్న M1 మరియు N1 వాహనాలు సంబంధిత AIS-185 సేఫ్టీ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉండాలి.
అక్టోబర్ 1, 2030: మార్కెట్లోకి వచ్చే అన్ని కొత్త M1 కేటగిరీ మోడళ్లలో (డ్రైవర్ సహా గరిష్టంగా 8 మంది కూర్చునే కార్లు) AEBS తప్పనిసరి.
అక్టోబర్ 1, 2032: అప్పటికే ప్రొడక్షన్లో ఉన్న పాత మోడళ్లకు కూడా ఈ సిస్టమ్ తప్పనిసరి అవుతుంది.
దీనితో పాటు ఎమర్జెన్సీ లేన్-కీపింగ్, స్టీరింగ్ కంట్రోల్స్, చైల్డ్-సీట్ యాంకర్లు వంటి మరిన్ని భద్రతా ప్రమాణాలను కూడా ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయనుంది.









