అమెరికా గగనతలంలో మరోసారి హై-టెన్షన్ వాతావరణం నెలకొంది. అత్యంత రహస్య మిలిటరీ బేస్‌ల సమీపంలో గుర్తుతెలియని వస్తువులు చక్కర్లు కొట్టడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల డీక్లాసిఫై చేసిన డాక్యుమెంట్లలో ఈ షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. గత ఏడాది కాలంలో సున్నితమైన నేషనల్ సెక్యూరిటీ సైట్ల పరిధిలో కనీసం 3 సార్లు నల్లటి త్రిభుజాకార వస్తువులు కనిపించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి.

Also Read : పాకిస్తాన్‌ను ముంచేస్తున్న LNG సంక్షోభం: చీకట్లో పొరుగు దేశం!

3 సెకన్లలో 2.4 కిలోమీటర్లు!

ఈ అజ్ఞాత ఆబ్జెక్ట్‌ల వేగం ఏవియేషన్ నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, ఒక బ్లాక్ ట్రయాంగిల్ ఆబ్జెక్ట్ కేవలం మూడు సెకన్లలో 1.5 మైళ్ల (సుమారు 2.4 కి.మీ) దూరాన్ని అధిగమించింది. అంటే దీని స్పీడ్ గంటకు సుమారు 1,800 మైళ్లు (దాదాపు 2,900 కి.మీ). ఇది అత్యాధునిక ఫైటర్ జెట్ వేగానికి సమానం. ఈ వస్తువు రెక్కల విస్తీర్ణం 9 నుంచి 15 అడుగులు, మందం 1 నుంచి 2 అడుగుల వరకు ఉన్నట్లు గుర్తించి, అధికారులు ప్రాథమిక స్కెచ్‌లను కూడా విడుదల చేశారు.

శబ్దం లేదు.. ఇంజిన్ ఆనవాళ్లు లేవు!

సాధారణంగా సూపర్ సోనిక్ స్పీడ్‌తో వెళ్లే ఫైటర్ జెట్లలో భారీ సౌండ్, ఎగ్జాస్ట్ పొగ స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఈ మిస్టరీ వస్తువుల్లో ఎలాంటి ఇంజిన్ సౌండ్ గానీ, ఎగ్జాస్ట్ గానీ కనిపించలేదు. చివరకు థర్మల్ స్కానింగ్‌లో కూడా ఇంజిన్ వేడి జాడలు దొరకకపోవడం గమనార్హం. అంతేకాదు, వింగ్స్, ఎయిర్ ఇన్‌టేక్స్, కాక్‌పిట్ వంటి సాధారణ భాగాలు ఏవీ వాటిలో లేవు.

Also Read : పాక్-మాల్దీవుల రక్షణ దోస్తీ: 20 కీలక ఒప్పందాలు.. భారత్‌కు కొత్త సవాలు!

అమెరికా సీక్రెట్ వెపనా? లేక ఏలియన్స్ పనా?

అత్యంత సున్నితమైన పరీక్షా కేంద్రాలపైనే ఇవి నిఘా వేయడం అమెరికా సెక్యూరిటీ వర్గాల్లో గుబులు రేపుతోంది. ఇది తమ సొంత టెక్నాలజీ కాదని అక్కడి అధికారులు భావిస్తున్నప్పటికీ, చైనా, రష్యా వంటి శత్రు దేశాల పనా లేక గ్రహాంతరవాసుల (Aliens) వాహనాలా అనే ప్రశ్నకు మాత్రం ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. పెంటగాన్ విడుదల చేసిన డాక్యుమెంట్లు పాత అనుమానాలకు సమాధానాలు ఇవ్వాల్సింది పోయి, మరిన్ని కొత్త చిక్కుముడులను సృష్టిస్తున్నాయి.