Lava Diwali Sale offers

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా భారతదేశంలోని తన స్మార్ట్‌ఫోన్‌లు, కీప్యాడ్ ఫోన్‌లపై అదిరిపోయే దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఈ డీల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లలో విరాట్, బోల్డ్, అగ్ని సిరీస్‌ల మోడళ్లపై భారీ ఆఫర్లు పొందొచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన కార్డులపై బ్యాంక్ ఆఫర్లు, EMI ఆప్షన్లు లభిస్తాయి. అంతేకాకుండా ఫీచర్ ఫోన్ డీల్స్ నవంబర్ 2 వరకు అమెజాన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పుడు ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో లావా విరాట్ V1, విరాట్ V1 5G, విరాట్ V1 ప్రో, విరాట్ కర్వ్ 5G లపై ఆఫర్లు పొందొచ్చు. ఇక అమెజాన్‌లో లావా బోల్డ్ N4 లైట్ , బోల్డ్ N2 లైట్, బోల్డ్ N2, బోల్డ్ N2 5G, బోల్డ్ N4 ప్రో 5G, అగ్ని 4 లపై డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఒకవేళ నేరుగా వెళ్లి కొనాలనుకుంటే.. లావా రిటైల్ స్టోర్లలో షార్క్ 2 ప్రో 5G, ఆరా కర్వ్ ఫోన్లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. లావా నవంబర్ 2 వరకు అమెజాన్‌లో హీరో శక్తి 2026, A2 స్మార్ట్, జెమ్ పవర్+ ఫీచర్ ఫోన్‌లపై కూడా తగ్గింపులను అందిస్తోంది. కాగా షార్క్ 2 ప్రో 5G, ఆరా కర్వ్ లావా రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.

Also Read : టాటా సన్స్‌లో రూ. 23,000 కోట్ల వివాదం.. నోయెల్ టాటా కీలక నిర్ణయం

Also Read : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: DA 3 శాతం పెంపు