
Glacial Lake Outburst : నేపాల్‌లో సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్స్ విచాద ఛాయలు మర్చిపోక ముందే, భూటాన్‌లో మరో భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. వాయవ్య భూటాన్‌లోని గాసా జిల్లాలో ఉన్న ‘షింటాఫు’ హిమానీనద సరస్సు ఒక్కసారిగా విస్ఫోటం చెందింది. దీంతో భారీగా వరద నీరు పోటెత్తడంతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ అయ్యాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
మో చు నది పరివాహక ప్రాంతంలోని ప్రసిద్ధ వేడినీటి బుగ్గ ‘గాసా త్చాచు’ వద్ద ఉన్న పర్యాటక సౌకర్యాలు, నిర్మాణాలు వరద ధాటికి కొట్టుకుపోయాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా అధికారులు ప్రజలను ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. 2021లో కూడా ఈ నది తన రూట్‌ను మార్చుకోవడంతో ఇక్కడ భారీ నష్టం వాటిల్లింది.
Also Read : గాంధీ మనవడి ల్యాండ్ వివాదం.. అమెరికా కోర్టులో గుజరాత్ ట్రస్ట్‌కు విజయం
🚨 BREAKING: Glacial Lake Bursts in Bhutan, High Alert for Severe Flooding in India! 🚨
Due to the bursting of Shintaphu Lake (GLOF) in Gasa, Bhutan, millions of tons of water and debris are surging toward India’s ‘Sankosh River’ via the Mo Chu River.
🔴 Impact and Alerts:
• West Bengal: Red alert in Alipurduar, Jalpaiguri, and Cooch Behar.
• Assam: Severe flood risk in Kokrajhar and Dhubri districts.
• Administrative Action: NDRF deployed, villages along the riverbanks being evacuated immediately.
People of North Bengal and Assam, please head to safe locations and avoid rumors. 🙏#Bhutan #GlacialLakeOutburst #NorthBengal #SankoshRiver
— TrendingTrolls (@TrendingTrol) October 30, 2026
ప్రస్తుతం వరద నీరు శ్రీగాంగ్ ప్రాంతాన్ని దాటి శరవేగంగా దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తోంది. ఈ ప్రభావంతో అస్సాంలోని ధుబ్రి, అలాగే పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు, అలీపుర్దువార్, జల్పాయిగురి జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉంది. పరిస్థితి తీవ్రతను గమనించిన భూటాన్ ఇప్పటికే భారత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మరోవైపు సకోశ్ నది పరివాహక ప్రాంత ప్రజలను పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్ స్థానిక యంత్రాంగం అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
Also Read : వారెవ్వా కిర్రాక్ ఆఫర్: రూ.8వేలకే 32 ఇంచుల టీవీ.. వదలొద్దు మావా..!
ఏమిటీ GLOF?
హిమానీనద సరస్సు గట్లు తెగిపోవడం వల్ల వచ్చే ఆకస్మిక వరదలను ‘గ్లేషియల్ లేక్ అవుట్‌బరస్ట్ ఫ్లడ్’ (GLOF) అంటారు. హిమాలయాల్లో అత్యంత ప్రమాదకరమైన 17 గ్లేసియర్ సరస్సుల్లో ‘షింటాఫు’ ఒకటి. ఉష్ణోగ్రతలు పెరిగి గ్లేసియర్లు కరగడం వల్ల సరస్సుల్లో నీటి ఒత్తిడి పెరిగి గట్లు బద్దలవుతాయి. ఫలితంగా దిగువ ప్రాంతాలను ముంచెత్తుతూ పెను వినాశనాన్ని సృష్టిస్తాయి. ప్రస్తుతం సహాయక బృందాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.









