జాతిపిత మహాత్మా గాంధీ మనవడు దివంగత కానూ గాంధీకి చెందిన 30 ఎకరాల ల్యాండ్‌ వివాదంలో అమెరికా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్జీనియాలోని ఆ విలువైన స్థలాన్ని కబ్జా చేసిన స్థానిక నివాసి గ్రెగరీ బ్లాక్‌ వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కోర్టు ఆదేశించింది.

Also Read : భూటాన్‌లో హిమానీనదం బ్లాస్ట్.. ఇండియాకు ప్రమాదం.. హైఅలర్ట్!

అసలేం జరిగింది?

వర్జీనియాలోని వారెన్ కౌంటీ, షేనాదోబా నేషనల్ పార్క్ సమీపంలో కానూ గాంధీ(Kanu Gandhi) 1987లో 30 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆయన, భార్య శివా గాంధీతో కలిసి 2013లో భారత్‌కు తిరిగివచ్చారు. 2016 నవంబర్‌లో కానూ గాంధీ మరణించగా, వీలునామా ప్రకారం ఆస్తులన్నీ శివా గాంధీ పేరిట మారాయి. ఆమె 2018లో దక్షిణ గుజరాత్‌లో ఒక చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ప్రాపర్టీలను దానికి బదిలీ చేశారు. 2020లో ఆమె కన్నుమూయడంతో సూరత్‌కు చెందిన పరిమల్ దేశాయ్ ఈ ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు తీసుకున్నారు.

ట్రస్ట్ ప్రాపర్టీల స్వాధీనంలో భాగంగా పరిమల్ దేశాయ్ 2024లో వర్జీనియా వెళ్లి దాదాపు 4,500 డాలర్లు ఖర్చు చేసి ల్యాండ్ సర్వే చేయించారు. వీలునామా సమర్పించి ట్రస్ట్ పేరిట టైటిల్ పొందారు. అయితే 2025 జనవరి 10న గ్రెగరీ బ్లాక్ అనే వ్యక్తి నోటీసు పంపుతూ, 2008 నుంచి అంటే 15 ఏళ్లకు పైగా ఆ స్థలం తన పొజిషన్‌లోనే ఉందని, అందులో మార్పులు చేర్పులు చేశానని క్లెయిమ్ చేశాడు.

Also Read : వారెవ్వా కిర్రాక్ ఆఫర్: రూ.8వేలకే 32 ఇంచుల టీవీ.. వదలొద్దు మావా..!

కోర్టు తీర్పు:

సుమారు 20 నెలల పాటు సాగిన ఈ కేసులో బ్లాక్ తన వాదనలను నిరూపించలేకపోయాడు. తుది విచారణలో కానూ గాంధీ మహాత్ముడి మనవడేనని, ఆ ల్యాండ్‌ను గాంధేయ సిద్ధాంతాల ప్రచారం కోసమే ట్రస్ట్‌కు ఇచ్చారని స్పష్టమైంది. దీంతో అక్టోబర్ 21న జడ్జి డారిల్ ఎల్ ఫంక్ ట్రస్ట్‌కు అనుకూలంగా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించడంతో గాంధీ ట్రస్ట్‌కు కీలక న్యాయం చేకూరింది.