
అమెజాన్‌లో శాంసంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. Samsung Galaxy S25 Ultra 5G అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి ఎడిషన్ సేల్‌లో అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదే సమయంలో భారీ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు లభిస్తున్నాయి. అందువల్ల తక్కువ ధరలనే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే ఇదే సరైన ఎంపిక. ఈ ఫోన్లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ ఉన్నాయి.
Samsung Galaxy S25 Ultra 5G Offers
Samsung Galaxy S25 Ultra 5G (12GB/256GB) వేరియంట్ భారీ తగ్గింపుతో అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.1,29,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.94,999 ధరకే అందుబాటులో ఉంది. దీంతోపాటు దీపావళి సేల్ సందర్భంగా అమెజాన్‌లో లభిస్తున్న కూపన్ ఆఫర్ ద్వారా నేరుగా రూ.10,000 ఆదా అవుతుంది. దీంతో Samsung Galaxy S25 Ultra 5G ధర మరింత తగ్గి రూ.84,999కి చేరుతుంది. అదనంగా అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.2,849 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఇలా ఈ డిస్కౌంట్లు అన్నింటితో కలిపి దాదాపు రూ.47,849 తగ్గింపుతో లభిస్తుంది.
Samsung Galaxy S25 Ultra 5G Features
Samsung Galaxy S25 Ultra 5G 1400×3120 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో కూడిన 6.9-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్ప్లేను కలిగి ఉంది. వెనుక భాగంలో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో.. 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.









