best 5g smartphones

దీపావళి పండుగ సీజన్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇప్పుడు మార్కెట్‌లో రూ.20వేల కంటే తక్కువ ధరలో లభించే ఐదు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం. వీటిలో షియోమి, శాంసంగ్, మోటరోలా వంటి బ్రాండ్‌లు కూడా ఉన్నాయి.

Also Read : దీపావళికి పటాకులు కాలిస్తే 6 నెలలు జైలు, లక్ష ఫైన్.. సర్కార్ సంచలన చట్టం!

Xiaomi Redmi 13 Prime 5G

Xiaomi Redmi 13 Prime 5G రూ.20వేల కంటే తక్కువ ధరలోనే లభిస్తుంది. దీని 6GB RAM + 128GB స్టోరేజ్‌ వేరియట్ ధర రూ.17,999గా ఉంది. ఈ Xiaomi స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.9-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇందులో 6,000mAh బ్యాటరీ, వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా అందించారు. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో కొనుక్కోవచ్చు.

OnePlus N6x

వన్‌ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్‌లోని 4GB + 128GB వేరియంట్ అమెజాన్లో రూ.18,999 లకే లభిస్తుంది. ఈ ఫోన్‌లో 7000mAh బ్యాటరీ, ఇన్‌బిల్ట్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.

Samsung Galaxy M17e 5G

శాంసంగ్ గెలాక్సీ M17e 5G అమెజాన్‌లో రూ.19,999 ధరకు కొనుక్కోవచ్చు. ఇది 6GB RAM + 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 6000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి.

Also Read : లక్షా నలభై వేల చీరలో.. మిస్ యూనివర్స్ బరిలోకి దిగిన కేరళ కుట్టి

iQOO Z11 Lite 5G

అమెజాన్‌లో లభిస్తున్న మరో స్మార్ట్‌ఫోన్ iQOO Z11 Lite 5G. దీని ధర రూ.17,499గా సంస్థ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది.

Moto G Max

Moto G Max స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. దీనిని రూ.19,490 ప్రారంభ ధరతో కొనుక్కోవచ్చు. వెనుక భాగంలో 50MP సోనీ లైటియా 600 కెమెరా ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.