
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలిస్ హువాంగ్ అనే మహిళ వేసిన హనీట్రాప్‌లో చిక్కుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదం కేవలం చిప్ సాంకేతికత దొంగిలించడం, కంపెనీ షేర్ల పతనం లేదా అమెరికా జాతీయ భద్రతకే పరిమితం కాకుండా జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత, వైవాహిక జీవితాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. చైనా గూఢచారితో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరగడం, దానిని ఆయన అంగీకరించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విచ్ఛిన్నం మొదలైంది. ఒకవేళ ఇది విడాకులకు దారితీస్తే.. చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా రికార్డు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
చైనా గూఢచారి ఆలిస్ హువాంగ్‌తో తనకు సంబంధం ఉందని జెన్సన్ హువాంగ్ స్వయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఆయన తన భార్య లోరీ హువాంగ్, పిల్లలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దాదాపు నాలుగు దశాబ్దాల వారి సుదీర్ఘ దాంపత్య జీవితంలో ఇలాంటి వివాదం రావడం ఇదే మొదటిసారి. జెన్సన్ హువాంగ్, లోరీల వివాహం 1985లో జరిగింది. అప్పటికి ఎన్విడియా కంపెనీ అసలు స్థాపించలేదు. 1993లో ఎన్విడియాను ప్రారంభించి ప్రపంచంలోనే అత్యంత విలువైన సెమీకండక్టర్ దిగ్గజంగా తీర్చిదిద్దారు. ఎన్నో ఏళ్ల కష్టాన్ని, కుటుంబాన్ని ఒకేసారి ప్రమాదంలో పడేసిన ఈ హనీట్రాప్ వ్యవహారంతో లోరీ హువాంగ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని.. ప్రస్తుతం వీరిద్దరూ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Also Read : అసలేం జరుగుతోంది: అమెరికా రక్షణ మంత్రిపై వేటు.. ఎవరీ పీట్ హెగ్సెత్?
ఒకవేళ జెన్సన్ హువాంగ్, లోరీ హువాంగ్ల విడాకులు ఖాయమైతే.. ఆస్తి పంపకాల విషయంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాలు కీలక పాత్ర పోషిస్తాయి. జెన్సన్ కుటుంబం ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే నివసిస్తోంది. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం ‘కమ్యూనిటీ ప్రాపర్టీ లా’ అమలులో ఉంటుంది. దీని ప్రకారం వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు సంపాదించిన ప్రతి రూపాయి లేదా ఆస్తి ఇద్దరికీ సమానంగా చెందుతుంది. విడాకులు తీసుకునే సమయంలో పెళ్లి తర్వాత కూడబెట్టిన మొత్తం సంపదను 50:50 నిష్పత్తిలో సమానంగా పంచాల్సి ఉంటుంది.
జెన్సన్, లోరీ 1985లోనే పెళ్లి చేసుకున్నారు. ఎన్విడియాను 1993లో స్థాపించారు. అంటే జెన్సన్ హువాంగ్‌కు ఉన్న సంపద అంతా కూడా వివాహం తర్వాత సంపాదించిందే. అందువల్ల కాలిఫోర్నియా చట్టం ప్రకారం ఆయన ఆస్తిలో సగం భాగం లోరీ హువాంగ్‌కు చట్టబద్ధంగా దక్కుతుంది. ప్రస్తుతం జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత నికర సంపద సుమారు రూ.14 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. చట్ట ప్రకారం ఈ ఆస్తిలో సగం వాటా ఇస్తే, జెన్సన్ హువాంగ్ వద్ద రూ.7 లక్షల కోట్లు మిగలగా, భార్య లోరీ హువాంగ్‌కు రూ.7 లక్షల కోట్లు దక్కుతాయి. ఒక్క విడాకుల ఒప్పందం ద్వారా లోరీ హువాంగ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళల జాబితాలో అగ్రస్థానంలోకి చేరే అవకాశం ఉంటుంది.
గతంలో ప్రముఖులు తీసుకున్న విడాకులతో పోలిస్తే జెన్సన్ హువాంగ్ విడాకుల మొత్తం దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన భార్య మెకెంజీ స్కాట్‌కు విడాకులు ఇచ్చినప్పుడు సుమారు రూ.4 లక్షల కోట్ల విలువైన అమెజాన్ షేర్లను ఆమెకు బదిలీ చేశారు. అప్పటి వరకు ఇదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచింది. అలాగే 2021లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెలిండా గేట్స్‌ల విడాకుల సమయంలో మెలిండాకు సుమారు రూ.6.3 ట్రిలియన్ల విలువైన ఆస్తులు, షేర్లు లభించాయి. అయితే జెన్సన్ హువాంగ్ చెల్లించాల్సి వచ్చే రూ.7 ట్రిలియన్ల మొత్తం వీటన్నింటినీ దాటేసి.. చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా రికార్డులకెక్కనుంది.
Also Read : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. వైట్ హౌస్ దగ్గర టెన్షన్ టెన్షన్!









