
ప్రపంచ టెక్నాలజీ, ఏఐ రంగంలో సంచలనం చోటుచేసుకుంది. అత్యంత ప్రముఖమైన కంపెనీలలో ఒకటైన చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా (Nvidia) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన చైనీస్ స్నేహితురాలితో వివాహేతర సంబంధంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం CEO పదవి నుంచే కాకుండా.. జెన్సన్ హువాంగ్ కంపెనీ ప్రెసిడెంట్, డైరెక్టర్ల బోర్డు సభ్యత్వం నుంచి కూడా పూర్తిగా తప్పుకున్నారు. ఈ పరిణామం టెక్ పరిశ్రమను ఒక్కసారిగా కుదిపేసింది.
ఇక ఆయన రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్విడియా బోర్డు తాత్కాలిక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం కంపెనీ CFOగా పనిచేస్తున్న కోలెట్ క్రెస్ అనే మహిళను తాత్కాలిక CEOగా నియమించారు. ఆమె తన సీఎఫ్ఓ పదవితో పాటు తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కంపెనీకి శాశ్వత CEOను నియమించే వరకు కోలెట్ క్రెస్ ఈ పదవిలో కొనసాగనున్నారు.
అయితే ఇప్పటికే బోర్డు కొత్త సీఈఓను నియమించే ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం కంపెనీలో పనిచేసే సమర్థులైన అధికారులతో పాటు.. బయట టెక్ ప్రపంచంలోని ప్రముఖుల పేర్లను బోర్డు పరిశీలిస్తోంది. మరోవైపు బోర్డు సభ్యుడైన హార్వే సి. జోన్స్‌ను ఎన్విడియా మొట్టమొదటి ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు జోన్స్ అఫీషియల్ ప్రకటన రిలీజ్ చేస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నాయకత్వంలో మార్పులు జరిగినప్పటికీ.. కంపెనీ రోజువారి కార్యకలాపాలు, ఇచ్చిన హామీలు, కొత్త ఉత్పత్తుల ప్రణాళికలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇన్నేళ్లు కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టిన జెన్సన్ హువాంగ్‌కు సంస్థ తరపున కృతజ్ఞతలు తెలిపారు.









