ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అత్యున్నత బాధ్యతల్లో ఉండాల్సిన ఓ వింగ్ కమాండర్ పాకిస్థాన్ గూఢచారి హనీ ట్రాప్‌లో పడి దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ మహిళా స్పై అందాల ఆశకు, నగ్న చిత్రాలకు కక్కుర్తిపడి సెన్సిటీవ్ వార్ ప్లాన్‌ను శత్రు దేశానికి తాకట్టు పెట్టాడు. ఢిల్లీ పోలీసులు తాజాగా కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read : మైక్రోసాఫ్ట్ సేవలు డౌన్.. లక్షల మందికి ఇబ్బందులు.. అసలు ఏం జరిగింది?

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య సదరు ఐఏఎఫ్ అధికారి వాట్సప్‌‌లో  పాక్ ఏజెంట్‌తో టచ్‌లో ఉన్నాడు. ఈ కాలంలో వీరి మధ్య 3 వేలకు పైగా చాటింగ్స్, డజన్ల కొద్ది ఫొటోలు, వీడియో కాల్స్ జరిగాయి. అవతలి నుంచి ఒక నగ్న చిత్రం వస్తే.. ఇటువైపు నుంచి దేశ రహస్య యుద్ధ వ్యూహానికి సంబంధించిన ఒక పేజీని షేర్ చేస్తానని ఆ అధికారి బేరం పెట్టాడు.

ఈ హానీట్రాప్ () మాయలో పడి దేశ డ్రోన్ సామర్థ్యాలు, సీక్రెట్ డ్రోన్ యూనిట్లు, సైనిక స్థావరాల వివరాలు, ఘర్షణ వేళ యుద్ధ విమానాల మోహరింపు వంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని శత్రువులకు చేరవేశాడు. అంతేకాదు, లేహ్‌, సూరత్‌గఢ్‌లోని మిలిటరీ విన్యాసాలకు సంబంధించిన వివరాలను లీక్ చేయడమే కాకుండా.. పాక్ పంపిన మాల్వేర్ యాప్‌ను తన కింద పనిచేసే సబ్‌ఆర్డినేట్ల డివైజ్‌లలోనూ ఇన్‌స్టాల్ చేయడం గమనర్హం.

మే నెలలో ఆఫీసుకు స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లడంతో భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చి ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన దిల్లీ పోలీసులు మే 30న అతడిని అరెస్ట్ చేసి తీహాడ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సైనిక వర్గాల్లో డిజిటల్ భద్రత, సోషల్ మీడియా వాడకంపై ఈ ఉదంతం తీవ్ర చర్చకు దారితీసింది.

Also Read : వాట్సాప్ నుంచి బుర్రపాడు ఫీచర్.. ఒక్కసారి చూస్తే మాయమైపోతుంది..!