
Amitabh Bachchan : బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు తన అనుచరులు ఇద్దరిని అరెస్టు చేసినప్పటికీ, ముంబైలో అమితాబ్ బచ్చన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రణాళిక ఆగలేదని గోల్డీ ధిల్లాన్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టులో గోల్డీ ధిల్లాన్ ఈ బెదిరింపులు చేసినట్లు తెలుస్తోంది. తన అనుచరులు వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేసినా తమ ప్రణాళికలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నాడు. ముంబైలో తనకు చెందిన సుమారు 200 మంది అనుచరులు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించాడు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ పేర్లను కూడా ప్రస్తావించాడు.
Also Read : కృష్ణవంశీతో అందుకే విడిగా ఉంటున్నా.. విడాకుల వార్తలపై అసలు నిజం చెప్పిన రమ్యకృష్ణ!
ఎన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకున్నా, బుల్లెట్లు తగలకుండా ఉండే అద్దాలు ఏర్పాటు చేసుకున్నా కాల్చి చంపుతామంటూ పోస్టులో బెదిరించినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు అనుమానిత షూటర్లను అరెస్టు చేసింది. ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసం బయట కాల్పులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అరెస్టుల ద్వారా ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపి డబ్బులు వసూలు చేయాలన్న మరో పథకం కూడా బయటపడినట్లు తెలుస్తోంది.
అరెస్టయిన వారిని పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన వికాస్ ఠాకూర్ అలియాస్ విక్కీ, తరన్తరన్కు చెందిన దీపక్ సింగ్ అలియాస్ దీప్‌గా గుర్తించారు. వీరిద్దరూ వేర్వేరు అయినప్పటికీ, ఒకదానితో మరొకటి సంబంధం ఉండే అవకాశం ఉన్న రెండు పథకాల్లో భాగంగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.వికాస్ ఠాకూర్‌కు ఢిల్లీలోని ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపే బాధ్యత అప్పగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ పని కోసం అతడు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. దీపక్ సింగ్ కూడా ఆ తర్వాత అతడితో కలవాల్సి ఉందని పోలీసులు గుర్తించారు.
మరోవైపు, గత నెల రోజులుగా అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’ను లక్ష్యంగా చేసుకుని మూడు సార్లు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన ఇంటి వద్ద భద్రతను మరింత పెంచారు. ప్రతి ఆదివారం అమితాబ్ బచ్చన్ తన ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేయడం ఆనవాయితీ. అయితే నవంబర్ 1న ఆయన బుల్లెట్లు తగలకుండా ఉండే అద్దాల వెనుక నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. సాధారణంగా ఇంటి బయట చక్రాలు ఉన్న ఓ ఎత్తైన వేదికపై నిలబడి అభిమానులకు కనిపిస్తారు. కానీ ఆ రోజు ఆ వేదికకు మూడు వైపులా రక్షణ అద్దాలు ఏర్పాటు చేశారు. వాటి వెనుక నుంచే అభిమానులకు అభివాదం చేశారు.
Also Read : పవన్‌కు సపోర్ట్‌గా రేణూ దేశాయ్.. విడాకులపై ఆమె రియాక్షన్ ఇదే!









