Pawan Kalyan
Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న  ఒక చిన్నారి బాలుడి చివరి కోరికను తీర్చడం కోసమే ఆయన ఈ పర్యటనకు వెళ్లనున్నారు. ఎలాగైనా తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్‌ను చూడాలన్నది ఆ బాలుడి ఆశ. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆ బాలుడిని పరామర్శించనున్నారు. నిజానికి ఈ పర్యటన కొన్ని రోజుల క్రితమే జరగాల్సింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే హన్మకొండకు వచ్చి ఆ బాలుడిని పరామర్శించాలని పవన్ అనుకున్నారు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆ సమయంలో తెలంగాణ పోలీసులు ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో రేపు ఆ బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు.

Manoj
చిత్తారి మనోజ్ వర్మ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం కలిగిన SEO నిపుణుడు. తన కెరీర్‌ను Wealus Technology లో ప్రారంభించి, 3.5 సంవత్సరాలు Website SEO మరియు SMO విభాగాల్లో పనిచేశారు. అనంతరం Multai Solutions లో 1.3 సంవత్సరాలు SEO మరియు SMM రంగాల్లో సేవలందించారు. ప్రస్తుతం RTV లో రెండున్నర సంవత్సరాలుగా డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO), కీవర్డ్ రీసెర్చ్, ఆన్-పేజ్ SEO, టెక్నికల్ SEO, మరియు కంటెంట్ స్ట్రాటజీ వంటి అంశాల్లో నైపుణ్యం కలిగి, వెబ్‌సైట్ల ఆర్గానిక్ విజిబిలిటీని పెంచడం, సెర్చ్ ర్యాంకింగ్స్ మెరుగుపరచడం, మరియు డిజిటల్ ప్రెజెన్స్‌ను బలోపేతం చేయడంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు.