
Gold Rates: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లోకి ఇరాన్ నుంచి ముడి చమురు సరఫరా భారీగా పెరగనుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పెరిగితే, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. అమెరికా-ఇరాన్ ఒప్పందం వల్ల బంగారం ధరలు కూడా భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 600 నుండి రూ. 800 వరకు తగ్గింది. అలాగే వెండి ధర కూడా కేజీకి రూ.1,500 వరకు పడిపోయింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2200 తగ్గి.. రూ.151,370కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.138,756గా ఉంది. ఇక 20 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.126,142గా, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.113,528గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కేజీ మీద రూ.7 వేలు తగ్గి రూ.245,290గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
The Sensex slipped 59 points to 77,095.99, while the Nifty fell 9 points to 24,076.95 in early trade.
Gold rates in India today stand at ₹1,52,601 per 10 grams for 24-carat gold.
Silver rates in India today stand at ₹2,47,090 per kg.@BSEIndia | @NSEIndia | @FinMinIndia… pic.twitter.com/mtv47jZYb0
— The Statesman (@TheStatesmanLtd) June 18, 2026









