
Amazon Prime Day Sale 2026: ఆన్లైన్లో షాపింగ్ చేద్దాం అనుకునే వారికి అదిరిపోయే సేల్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఎవరూ ఊహించలేని, నమ్మలేని ఆఫర్లు, డిస్కౌంట్లు పొందవచ్చు. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రొడెక్టులపై బెనిఫిట్స్ లభించనున్నాయి. బయట కొనుగోలు చేసే ధరలో సగం ధరకే ప్రొడెక్టులు మీ ఇంటి వద్దకే వచ్చేస్తాయ్ అంటే నమ్ముతారా?.. నమ్మాల్సిందే భయ్యా.
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ పిచ్చెక్కిపోయే సేల్ తీసుకొస్తోంది. తన 10వ వార్షిక ప్రైమ్ డే షాపింగ్ సేల్(Amazon Prime Day Sale 2026)ను ప్రకటించింది. ఈ ఏడాది జరిగే ఈ భారీ షాపింగ్ సేల్ తేదీలు, ఆఫర్లు, డిస్కౌంట్లు, ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : లవర్‌తో గ్రాండ్‌గా పెళ్లి కోసం బిగ్ స్కెచ్…రూ.4కోట్ల నగలు చోరీ చేసి…
Amazon Prime Day Sale 2026 Date
Amazon Prime Day Sale 2026 జులై 4వ తేదీన ప్రారంభం కానుంది. ఇది మూడు రోజుల పాటు కొనసాగనుంది. అంటే జులై 6వ తేదీ వరకు ఇందులో అదిరిపోయే ఆఫర్లతో ప్రొడెక్టులను కొనుగోలు చేయవచ్చు. జులై 4న అర్థరాత్రి 12 గంటలకు సేల్ ఓపెన్ అయి.. జులై 6 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది.
Also Read : నీట్-యూజీ రీ టెస్ట్ వాయిదా? క్లారిటీ ఇచ్చిన NTA…
Amazon Prime Day sale discounts 2026
ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయన్స్ సహా దాదాపు 500లకు పైగా కొత్త ప్రొడెక్ట్స్ లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా ఇందులో ఎకో స్మార్ట్ స్పీకర్లు, అలెక్సా డివైసెస్, ఫైర్ టీవీ స్టిక్స్‌పై 45 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు.
అలాగే శాంసంగ్, HP, వన్‌ప్లస్, లెనోవో వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు లభించనున్నాయి. ఇంకా ఫ్యాషన్ విషయానికొస్తే.. పలు దుస్తులపై ఆఫర్లు పొందవచ్చు.
ఇందులో బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. SBI, Axis Bank వంటి క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేసేవారికి 10 శాతం ఎక్స్ట్రా డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డు ఉపయోగించే ప్రైమ్ సభ్యులకు అన్లిమిటెడ్ 5% క్యాష్‌బ్యాక్ వస్తుంది. వీటితో పాటు అమెజాన్ మరో బెనిఫిట్ కూడా అందిస్తోంది. అదే Amazon Pay Later.. దీని ద్వారా రూ.1500 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రొడెక్టులపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. దీంతో ఎలాంటి వడ్డీ లేకుండానే ఇందులో కొనుక్కోవచ్చు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇది కేవలం ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ సేల్ వర్తిస్తుంది. సాధారణ సభ్యులకు ఇది వర్తించదు. అందువల్ల మీరు కూడా ఒక సరికొత్త ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే అమెజాన్ భారీ ఆఫర్ అందిస్తోంది. ఏడాది ప్లాన్ ధర రూ.1499 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.999లకే అందుబాటులో ఉంచింది. అలాగే ప్రైమ్ లైట్ వార్షిక ధరను రూ.799 నుండి రూ.599లకి తగ్గించింది. ఇంకా ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ధరను రూ.399 నుండి రూ.299లకి తీసుకొచ్చింది.









