
ఇరాన్లో ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ వీడ్కోలు కార్యక్రమాల కోసం ప్రపంచవ్యాప్తంగా సుమారు 100కు పైగా దేశాల నుండి నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ అధికారిక సంతాప కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దాదాపు 30 నుండి 40 దేశాల ప్రధానులు, అధ్యక్షులు, విదేశాంగ మంత్రులు స్వయంగా ఇరాన్ రాజధాని టెహరాన్‌కు చేరుకుంటున్నారు. ఇరాన్ దేశంతో భౌగోళికంగా, సాంస్కృతికంగా చిరకాలంగా మంచి సంబంధాలు ఉన్న పక్క దేశాల నాయకులు ఈ వీడ్కోలకు హాజరయ్యారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తన దేశానికి చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి స్వయంగా ఇరాన్ చేరుకున్నారు.
అలాగే మధ్య ఆసియా ప్రాంతంలో ఇరాన్‌కు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న తజికిస్తాన్ దేశ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్ కూడా ఈ వీడ్కోలు వేడుకల్లో పాల్గొనేందుకు టెహ్రాన్ వచ్చారు. వీరితో పాటు ఇరాక్ దేశానికి చెందిన అత్యున్నత రాజకీయ నాయకులు, అక్కడి పవిత్ర నగరాల ముఖ్య మత పెద్దలు, అరబ్ దేశాల దౌత్యవేత్తలు కూడా ప్రగాఢ సానుభూతిని తెలపడానికి పెద్ద ఎత్తున ఇరార్ తరలివెళ్లారు.
Also Read : కూలిపోనున్న పాక్ ప్రభుత్వం.. ఎదురుతిరిగిన వేల మంది ప్రజలు
చైనా ప్రభుత్వం తరపున వారి దేశ అత్యున్నత చట్టసభ స్టాండింగ్ కమిటీ వైస్ చైర్మన్ ‘హే వీ’ నేతృత్వంలోని పెద్ద బృందం ఇరాన్ చేరుకుంది. అలాగే రష్యా ప్రభుత్వం కూడా ఇరాన్‌కు తమ పూర్తి మద్దతును తెలుపుతూ దేశ సీనియర్ పార్లమెంట్ ప్రతినిధులు, గ్లోబల్ దౌత్యవేత్తలను ప్రత్యేక విమానాల్లో టెహ్రాన్‌కు పంపించింది.
భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా, అలాగే బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఇరాన్ చేరుకున్నారు. వీరితో పాటు భారత అధికార పక్షానికి చెందిన బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఇరాన్ ప్రభుత్వం నుండి వ్యక్తిగత ఆహ్వానం అందడంతో ఆయన కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఖమేనీ కేవలం ఇరాన్ దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలకు ఒక అత్యున్నత ఆధ్యాత్మిక గురువుగా ఉండేవారు. అందుకే రాజకీయ నాయకులే కాకుండా, ప్రపంచంలోని దాదాపు 90కి పైగా దేశాల నుండి రకరకాల ఇస్లామిక్ స్కాలర్స్ , వివిధ దేశాల ప్రధాన మత పెద్దలు, దైవచింతకులు ఈ వీడ్కోలకు హాజరు కానున్నారు. వీరితో పాటు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, పలు అంతర్జాతీయ హక్కుల సంస్థల ప్రతినిధులు కూడా ఈ అధికారిక సంతాప దినాల్లో పాల్గొని నివాళులర్పిస్తున్నారు.
Also Read : వెనిజులాలో రక్తం చిమ్మిన ఆకాశం.. భయపడుతున్న ప్రజలు.. దీని వెనుక ఉన్న అసలు కారణమిదే!









