Karimnagar: కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, BRS MLA Gangula Kamalakar గంగుల కమలాకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా బలగాలు మోహరించాయి. నేడు బీఆర్ఎస్ కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా గంగులను హౌస్ అరెస్ట్ చేశారు. బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు బీఆర్ఎస్ ముఖ్య నేతలను, కౌన్సిలర్లను తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ శ్రేణులు దాడి చేశారు.
Also Read: మీ సీక్రెట్స్, ‘పర్సనల్’ చాటింగ్ మొత్తం అవుట్.? ఇన్స్టాగ్రామ్ సంచలన నిర్ణయం!
అంతేకాకుండి ఆ సమయంలో క్యాంప్ ఆఫీస్ లోపల ఉన్న కౌశిక్ రెడ్డిపై దాడికి విఫలయత్నం చేసిన బీజేపీ శ్రేణులు.. అక్కడ తీవ్రంగా ఫర్నిచర్‌ను, కిటికీలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆవరణలో పార్క్ చేసి ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫార్చునర్ వాహనాన్ని రాళ్లు, కర్రలతో కొట్టి పూర్తిగా ధ్వంసం చేశారు. తమ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్, వాహనాలపై జరిగిన భౌతిక దాడులను నిరసిస్తూ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కరీంనగర్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు.
Also Read: త్రిష వల్లే విజయ్‌కు ఈ దరిద్రం.. వేణుస్వామి సంచలన జాతకం!
కరీంనగర్ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు
వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని బీఆర్ఎస్ పిలుపునివ్వగా.. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు కరీంనగర్ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు 144 సెక్షన్ తరహా ఆంక్షలను అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.







