
ప్రముఖ టూ వీలర్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన సబ్ బ్రాండ్ విడా నుంచి అదిరిపోయే కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. తాజాగా VIDA VX2 Plus 4.4 kWh వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఎక్కువ మైలేజీ అందిస్తుంది. కంపెనీ దీని ధర, ఫీచర్లను తాజాగా వెల్లడించింది.
VIDA VX2 Plus 4.4 kWh వేరియంట్ స్కూటర్‌లో అతి పెద్ద అంశం దీని బ్యాటరీ. ఇది 2.2 kWh సామర్థ్యం గల రెండు వేర్వేరు రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు బ్యాటరీల మొత్తం సామర్థ్యం 4.4 kWh అవుతుంది. ఈ బ్యాటరీలను స్కూటీ నుంచి బయటకు తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని మళ్లీ అందులో అమర్చుకోవచ్చు. ఇది అపార్ట్‌మెంట్‌లలో ఉండేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇక ఈ VIDA VX2 Plus కొత్త వేరియంట్‌కి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే భారీ మైలేజీ అందిస్తుంది. IDC (ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) వెల్లడించిన దానిప్రకారం.. ఈ 4.4 kWh బ్యాటరీకి ఫుల్‌గా ఛార్జింగ్ చేస్తే 187 కి.మీ మైలేజీ లభిస్తుంది. ఇది రోజూ ఉద్యోగాలు చేసేవారికి, దూర ప్రయాణాలకు ఎంతగానో సరిపోతుంది.
Also Read : Realme నుంచి ఊరమాస్ మొబైల్.. 8,000 mAh బ్యాటరీతో ఫీచర్ కిర్రాక్..!
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కంపెనీ VIDA VX2 Plus 4.4 kWh వేరియంట్ స్కూటీతో పాటు 1kW సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌ను ఫ్రీగా అందిస్తోంది. దీని సహాయంతో ఇంటి వద్దే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 0 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సుమారు 3.30 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. అలాగే ఇది DC ఛార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. విడా సంస్థకు చెందిన ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ల ద్వారా 0 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కేవలం 65 నిమిషాలు మాత్రమే పడుతుంది.
ఇక VIDA VX2 Plus 4.4 kWh వేరియంట్‌లోని ఇంజిన్ స్పీడ్, టాప్ స్పీడ్ విషయానికొస్తే.. ఇది 6kW గరిష్ట శక్తిని, 26 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని కారణంగా ఈ స్కూటీ గంటకు గరిష్టంగా 90కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లను అందించారు. వాటిలో ఇకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు ఆప్షన్‌లు ఉన్నాయి. ఇవి రోడ్లపై సులభంగా ప్రయాణించాడానికి సహాయపడతాయి. అలాగే దీనిలో ‘Boost’ ఫంక్షన్ కూడా అందించారు. ఇది రోడ్లపై వేరే వాహనాలను ఓవర్‌టేక్ చేయడానికి వీలుగా.. క్షణాల్లో స్పీడ్ పెంచుతుంది.
VIDA VX2 Plus 4.4 kWh వేరియంట్‌లో 4.3 అంగుళాల అధునాతన TFT డిస్‌ప్లే ఉంది. అలాగే మొబైల్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సహా మరెన్నో అధునాతన ఫీచర్లను ఈ స్కూటీలో అందించారు. ఇక దీని ధర విషయానికొస్తే.. VIDA VX2 Plus 4.4 kWh వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.43 లక్షలుగా నిర్ణయించారు.
Also Read : అయోధ్య CEO పోస్టుకు ఫుల్ డిమాండ్.. క్యూ కట్టిన మాజీ IAS ఆఫీసర్స్!









