BIG BREAKING: తిరుచ్చి ఈస్ట్‌ స్థానానికి విజయ్ రాజీనామా..

తమిళనాడు సీఎంగా టీవీకే చీఫ్‌ విజయ్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్.. పెరంబూర్ అలాగే తిరుచ్చి ఈస్ట్‌ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచారు. అయితే విజయ్ తిరుచ్చి ఈస్ట్‌ స్థానానికి రాజీనామా చేశారు. పెరంబూర్ ఎమ్మెల్యేగానే కొనసాగనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 

చట్ట ప్రకారం.. ఒక అభ్యర్థి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చు. ఒకవేళ ఈ రెండు స్థానాల్లో గెలిస్తే ఒకదానిక కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకే విజయ్ తిరుచ్చి ఈస్ట్‌ స్థానాన్ని వదులుకున్నారు. తమిళనాడులో AIADMK అధినేత్రి దివంగత జయలలిత తర్వాత రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన నేతగా విజయ్ గుర్తింపు దక్కించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 

Also Read: మొదలైన మాటల యుద్ధం.. విజయ్‌ స్పీచ్‌పై స్టాలిన్ విమర్శలు

ఇక 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ కూడా గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేశారు. అలాగే సీఎం రేవంత్ కూడా ఈ ఎన్నికల్లో కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో బరిలోకి దిగారు. కానీ వీళ్లిద్దరూ కూడా కామారెడ్డిలో ఓడిపోయారు. ఈ స్థానంలో బీజేపీ నేత వెంకటరమణా రెడ్డి గెలిచారు.