
Jana Nayagan Twitter Review: తమిళనాడు సీఎం, దళపతి జోసెఫ్ విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో జన నాయకుడుగా, హిందీలో జన నేత పేరుతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ మూవీని రీమేక్ చేసి ఈ సినిమాను తీశారు. అయితే ఇప్పటికే ప్రిమియర్లు, షోలు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు ఆయన చేసే కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ రెండింటినీ దర్శకుడు సరిగ్గా బ్యాలెన్స్ చేశారని నెటిజన్లు అంటున్నారు. సినిమాలో మాత్రం యాక్షన్ సన్నివేశాలు, హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ప్రధానంగా హైలైట్ అయ్యాయని టాక్ వినిపిస్తోంది.
Also Read : బాలయ్యకు గాయం : ఆపరేషన్ చేయాలన్న డాక్టర్లు.. NTR సంచలన ట్వీట్!
Showtime: One last time, one last danceeee!! #JanaNayagan 😭😭🥵🥵🔥🔥🔥🔥🔥🔥
GOOSEBUMPS UNLIMITEDDDDDDDDDDDDDDDDDDDD! Peakkkkk title card 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/3MlpPYBDe4
— Dileep (@dileeptweetsz) July 23, 2026
ముఖ్యంగా టైటిల్ కార్డు అయితే అదిరిపోయిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయ్ సీఎం అయిన తర్వాత ఈ మూవీ రావడంతో భారీగా అంచనాలు పెరిగాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అవినీతి నేతలపై వేసిన పవర్ ఫుల్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. విజయ్ చెప్పే ప్రతీ డైలాగ్ ఆయన రాజకీయ ప్రయాణానికి అద్దం పట్టేలా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. మాతృక ‘భగవంత్ కేసరి’లో శ్రీలీల చేసిన పాత్రను తమిళంలో మమితా బైజు చేయగా.. కాజల్ చేసిన రోల్‌లో పూజా హెగ్డే నటించారు. మమితా బైజు తన అల్లరితో పాటు ఎమోషనల్ సీన్లలో జీవించేసిందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక విలన్‌గా నటించిన బాబీ డియోల్ తన స్టైలిష్ లుక్స్‌తో పాటు భయంకరమైన విలనిజంతో మెప్పించారు.
Also Read : హీరో బాలకృష్ణకు ప్రమాదం!
The whole theater erupts 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #JanaNayaganFromToday pic.twitter.com/CTxcV7ZwHL
— Tharani K (@CinemaAngle) July 23, 2026
டைட்டில் கார்டு சம்பவம் 🔥🔥🔥@actorvijay #JanaNayagan pic.twitter.com/UqqsWgiq2n
— 🔥 𝒟𝒾𝓃𝑒𝓈𝒽 🔥 TVK🔥 (@dhinesh_000) July 23, 2026









