సాయి రాజేశ్ -ఎస్‌కేఎన్ కాంబినేషన్‌లో వచ్చిన మరో డిఫరెంట్ లవ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీపై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది.

Also Read : జన నాయగన్ ట్విట్టర్ రివ్యూ.. పూనకాలు తెప్పిస్తున్న మాస్ ఎలిమెంట్స్.. థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ

కథ విషయానికొస్తే.. కాబోయే భర్త పెళ్లి పీటలపై మోసం చేయడంతో నివేదిత (శ్రీ గౌరీ ప్రియా) డిప్రెషన్‌లోకి వెళ్తుంది. ఆ బాధను తట్టుకోలేక చెన్నైకి వచ్చి తాగుడుకు బానిసవుతుంది. అదే సమయంలో ఎలాగైనా డైరెక్టర్ కావాలని చెన్నై వచ్చి కష్టపడుతున్న స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఆమెకు పరిచయమవుతాడు. అతడి ప్యాషన్ చూసి చలించిన నివేదిత, ఒక సీనియర్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చాన్స్ ఇప్పిస్తుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలనుకునే సమయంలో ఒక విచిత్రమైన ఆత్మ ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుంది.

సినిమా ఫస్టాఫ్ చాలా ఆసక్తికరంగా సాగిపోతుంది. కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్, గౌరీ ప్రియా నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని ఫన్నీ సీన్లు, మణిశర్మ పాటలు మంచి అనుభూతిని ఇస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వచ్చే ఆత్మ, ఫాంటసీ ట్విస్ట్ తో సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెరుగుతాయి.

Also Read : బాలయ్యకు గాయం : ఆపరేషన్ చేయాలన్న డాక్టర్లు.. NTR సంచలన ట్వీట్!

అయితే రెండో భాగంలో కథ కాస్త లాజిక్ వదిలేసి ఫాంటసీ వైపు వెళ్తుంది. కొన్ని చోట్ల సీన్లు సాగదీసినట్టు అనిపించినా.. క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం బాగానే వర్కవుట్ అయ్యాయని మల్టీప్లెక్స్ ప్రేక్షకులు చెబుతున్నారు. కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్‌గా నటించగా, గౌరీ ప్రియా తన నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. రొటీన్ లవ్ స్టోరీలా మొదలై సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారిందని నెటిజన్లు అంటున్నారు.