
Jayam Ravi : తమిళ నటుడు జయం రవికి బిగ్ రిలీఫ్ దొరికింది. తన భార్య ఆర్తితో విడాకుల కేసులో ఊరట లభించింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు నెలకు రూ. 40 లక్షల మధ్యంతర భరణం కావాలన్న ఆర్తి డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. దానికి బదులుగా, కేసు పరిష్కారమయ్యే వరకు అతనికి నెలకు రూ. 3 లక్షల మధ్యంతర భరణం ఇవ్వాలని చెన్నై కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా, కొన్ని నిర్దిష్ట షరతులకు లోబడి, జయం రవి తన పిల్లలను కలవడానికి, వారితో సమయం గడపడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
Also Read : వాళ్లను ట్రోల్ చేసి మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు .. అల్లు అర్జున్ కీలక కామెంట్స్!
కాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరైన నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె అయిన ఆర్తితో , జయం రవిల వివాహం 2009 జూన్ 4న జరిగింది. జయం రవి ప్రముఖ తమిళ చిత్ర ఎడిటర్ మోహన్ కుమారుడు. అయితే వ్యక్తిగత కారణాల వలన వీరిద్దరూ 2002 సెప్టెంబర్‌లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో జయం రవి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్తి, ఆమె కుటుంబం తనను సంవత్సరాల తరబడి బానిసలా చూశారని, అనవసరమైన అవమానాన్ని తాను సహించలేకపోయానని ఆయన ఆరోపించారు.
ఈ క్రమంలోనే చట్టబద్ధమైన విడాకులు లభించే వరకు తాను మళ్లీ సినిమాల్లో నటించబోనని జయం రవి స్పష్టం చేశారు. “నేను చాలా కాలంగా బహిరంగంగా మాట్లాడలేదు, కానీ ఇకపై అలా కాదు, బహిరంగంగా మాట్లాడాల్సిన సమయం వచ్చింది. అందరూ నన్ను ఒక పేదవాడినని, ఒక పనికిమాలిన వాడినని అనుకుంటారు. నేను గతంలో అలా ఉండేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే వ్యక్తికి కోపం వస్తే భరించడం కష్టం. కానీ అందరూ నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. విడాకులు లభించే వరకు నేను నటించను. ఈ సైబర్ దాడి ముగిశాక నేను తిరిగి వస్తాను.” అని కూడా ఆయన అన్నారు.
జయం రవి వర్షెన్ ఇలా ఉంటే తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా విడాకులు జరిగాయని ఆర్తి ఆరోపిస్తున్నారు. జూన్‌లో, వారి 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా, ఆర్తి ఇన్స్టాగ్రామ్ నుండి రవితో ఉన్న ఫోటోలను తొలగించారు.
Also Read : పేరు మార్చేసిన ఆ ఒక్క ‘పావలా’ నాటిక.. సీనియర్ నటి శ్యామల లైఫ్ చేంజింగ్ స్టోరీ!









