EC SIR Phase 3: 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర్‌’ మూడో దశ.. ఈసీ కీలక ప్రకటన

EC SIR Phase 3: దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్టును పటిష్టం చేసే టార్గెట్‌తో ఎన్నికల సంఘం (EC) గురువారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మూడో దశను ప్రకటించింది. ఈ దశలో మొత్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కానీ హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలను ప్రస్తుతం ఈ జాబితా నుంచి మినహాయించారు. ఎందుకంటే ఈ మూడు ప్రాంతాల్లో జనగణన (సెన్సస్) రెండో దశ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఎగువ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉంది. విపరీతంగా మంచు కురుస్తున్న కురుస్తోంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అక్కడ ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను మళ్లీ ప్రకటిస్తామని ఈసీ తెలిపింది.

Also Read: పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

 అయితే ఈ మూడో దశ సవరణ ప్రక్రియలో దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్లను చేరుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీనికోసం  ఆయా రాష్ట్రాల్లో 3.94 లక్షల మందికి పైగా బూత్‌ లెవల్ ఆఫీసర్లను (BLOs) నియమించనున్నారు. వీళ్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన 3.42 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లు సైతం అధికారులకు సహకారం అందించనున్నారు. ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో పారదర్శకతను పెంచడం కోసం, అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఈ మూడో విడత సవరణ కీలకం కానుంది.

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

ఇప్పటికే పూర్తయిన మొదటి రెండు దశల పురోగతిని ఈసీ వివరించింది. మొదటి రెండు దశల్లో 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకంగా 59 కోట్ల మంది ఓటర్లను కవర్ చేసినట్లు పేర్కొంది. ఈ ప్రక్రియలో భాగంగా 6.3 లక్షల మంది BLOలు, 9.2 లక్షల మంది BLAలు పాల్గొన్నారు.