SIR Update India: తెలంగాణ, ఏపీలో సర్‌ ఎప్పుడంటే ?

SIR Update India: కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, ఝార్ఖండ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, ఒడిశా, పంజాబ్‌, సిక్కిం, కర్ణాటక, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌,  త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. 

Also Read: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

తెలంగాణలో జూన్‌ 15 నుంచి 24 వరకు సర్‌ గురించి సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం జూన్‌ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. అదే రోజు నుంచి సెప్టెబర్‌ 28 దాకా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇక అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.

Also Read: దొంగలకు సాలరీ, ఇన్సెంటీవ్స్.. కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసుల షాకింగ్ నిజాలు!

ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే జూన్‌ 5 నుంచి 14 వరకు SIRపై సిబ్బందికి శిక్షణ ఉంటుంది. జూన్ 15 నుంచి జులై 14 వరకు సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత జులై 21న ఓటర్ల ముసాయిదా లిస్టును ప్రకటిస్తారు. ఇక జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. చివరగా సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ మూడో దశలో 3.94 లక్షల మందికిపైగా బూత్ లెవెల్ అధికారులు, 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. మొత్తానికి డిసెంబర్‌ 23న త్రిపురతో మూడో దశ SIR ప్రక్రియ ముగుస్తుంది.