BREAKING: చార్ ధామ్ యాత్ర .. 38 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రలో కేవలం 26 రోజుల్లోనే 38 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మృతుల్లో ఎక్కువమంది అనారోగ్య సమస్యల వల్లే మరణించారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు తెలిపారు. ఒక్క కేదార్‌నాథ్‌లోనే అత్యధికంగా 21 మంది మరణించారు. బద్రీనాథ్‌లో 7గురు, గంగోత్రి, యమునోత్రిలలో ఐదుగురు చొప్పున భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 10న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు, అనంతరం కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల తలుపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే.

Also Read: నీట్ యూజీ పరీక్ష తేదీపై కీలక అప్‌డేట్

ఉత్తరాఖండ్‌లోని ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ ప్రాణవాయువు తక్కువగా ఉన్నప్పటికీ భక్తులు ఎక్కువగా వస్తుంటారు. బుధవారం రోజున కేదార్‌నాథ్‌ను 4.91 లక్షల మంది సందర్శించగా.. బద్రీనాథ్‌కు 3.02 లక్షల మంది భక్తులు తరలివచ్చారు.అలాగే గంగోత్రిని 1.94 లక్షలు, యమునోత్రిని 1.92 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. యాత్రకు వచ్చే భక్తులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రావాలని.. సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. 

Also Read: ఢిల్లీలో వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ .. త్రిపుర సంచలన నిర్ణయం!