
Brahmanandam : తెరమీద అందరినీ నవ్వించే నటుడు బ్రహ్మానందం ఇంట్లో ఓ హృదయం అన్నయ్య అనే పిలుపు కోసం ఎదురుచూస్తుంది. తమ్ముడు ఒక చిన్న పలకరింపు పలకరిస్తాడేమో అని ఆశగా ఎదురుచూస్తూ చెప్పిన బ్రహ్మానందం సోదరుడి మాటలు ఇప్పుడు అందరి మనసులను పిండేస్తున్నాయి.
మాకు ఆరుగురు పిల్లలం పుడితే.. నలుగురు చనిపోయారు. ఉన్నది మేమిద్దరమే. కానీ, ఇంతపెద్ద ప్రపంచంలో నేను మాత్రం ఒంటరిగా మిగిలిపోయాను అంటూ శ్రీవదన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ వయసులో తోడబుట్టినవారి పలకరింపు కోసం, చిన్ననాటి ప్రేమానుబంధాల కోసం ఒక అన్న పడుతున్న ఆరాటం ఎవరినైనా కరిగిస్తుంది. ఇటీవల బ్రహ్మానందం సొంత ఊరికి వచ్చినా కూడా కనీసం తనను పలకరించకుండానే వెళ్ళిపోయారని ఆయన బాధపడ్డారు. తన తమ్ముడి నుంచి పెద్దగా ఏమీ ఆశించడం లేదని.. కేవలం ఆప్యాయంగా పలకరించి, ఎలా ఉన్నావని అడిగితే చాలని ఆయన కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు.
వృద్ధాప్యం లో అన్నయ్య అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం గారి
తోడబుట్టిన అన్నయ్య..మేము ఆరుగురు సంతానం నలుగురు చనిపోయారు ఉన్నది ఇద్దరమే , ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది నేను ఒక్కడినే,
ఈ మధ్యనే వచ్చాడు ఊరికి,కనీసo
పలకరించకుండా పోయాడుతమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి అన్నయ ఎలా… pic.twitter.com/901plLBjun
— AVM (@AvmNews7) August 19, 2026
ఒరేయ్ అన్నయ్యా.. ఎలా ఉన్నావురా? అని తమ్ముడు ఫోన్ చేసి ఒక్కమాట అడగకపోతాడా అని ప్రతీ రోజూ ఆశగా చూస్తుంటానని శ్రీవదన్ చెప్పారు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, సొంత అన్నదమ్ముల ప్రేమ ముందు ఏదీ సరిపోదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా, ఇది చూసిన తర్వాతైనా బ్రహ్మానందం స్పందించి, తన అన్నయ్యను కలిసి మాట్లాడుతారో లేదో అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇక బ్రహ్మానదం సినిమాల విషయానికి వస్తే…. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు.









