
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్‌ల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి ఎలాంటి అనుమతులు, ఆమోదాలు లేదా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని.. ఈ మార్గాన్ని నియంత్రించే అధికారం ఏ ఒక్క దేశానికీ కూడా లేదని అమెరికా తెలిపింది. ఈ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. – US Warning To Iran
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, వాణిజ్య నౌకల రాకపోకలను మళ్లీ ప్రయాణించడానికి చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు. తమ ఒప్పందానికి రావడానికి ఇరాన్‌కు ఇదే చివరి అవకాశం అని హెచ్చరిస్తూనే.. గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ వెల్లడించారు. మరోవైపు ఇరాన్ సర్వోన్నత నాయకుడు సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయీ స్పందించారు. టెహ్రాన్ ఆమోదించనంత వరకు ఏ నౌకా మార్గాన్ని కూడా అంగీకరించబోమని తేల్చి చెప్పారు. అమెరికాతో తాము ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు.
Also Read : ఉక్రెయిన్ వీధుల్లో రష్యన్ డ్రోన్ హంటింగ్.. వ్యాపారిని వెంటాడిన డ్రోన్లు.. ఎలా ఎటాక్ చేస్తాయంటే?
అగ్రరాజ్యం, ఇరాన్ ల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగనప్పటికీ ఖతార్, ఒమన్ వంటి మధ్యవర్తిత్వ దేశాల ద్వారా ముసాయిదా ఒప్పందాలు మార్పిడి జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే దిశగా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఖతార్, అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు. అయితే ఒమన్‌తో కేవలం చర్చలు సరిపోవని, ఇరాన్‌పై అమెరికా తన సైనిక చర్యలను పూర్తిస్థాయిలో నిలిపివేస్తేనే జలసంధిలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపాయి. ఈ దౌత్య సంక్షోభం వెనుక అమెరికా ఆయుధ నిల్వలపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇరాన్‌తో నెలకొన్న వివాదం కారణంగా అమెరికా తన క్షిపణి నిరోధక వ్యవస్థలైన THAAD, పేట్రియాట్ నిల్వలను అత్యధికంగా ఉపయోగించింది. దీనివల్ల వాయు రక్షణ నిల్వలు తగ్గుముఖం పట్టాయని వార్తలు వస్తున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెరిగితే క్షిపణి దాడులను తట్టుకోవడం కష్టమవుతుందని గల్ఫ్ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఆందోళనలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ప్రెసిడెంట్ ట్రంప్ నిర్దేశించిన ఏ లక్ష్యాన్నైనా సాధించడానికి తమ వద్ద తగినంత సైనిక సామర్థ్యం, ఆయుధ నిల్వలు ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఓమన్, ఇరాన్ మధ్య ఉన్న హోర్ముజ్ జలసంధి ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మార్గంలో చిన్నపాటి అంతరాయం ఏర్పడినా అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.
Also Read : కిమ్ మరో సంచలనం.. కుక్క మాంసం సూప్ తాగాలని ఆదేశాలు.. నార్త్ కొరియాలో అసలేం జరుగుతోంది?









