UPI Charges: దేశంలో ఇక మీదట యూపీఐ సేవలు ఉచితంగా వినియోగించుకోవడం కుదరదు. యూపీఐ సేవలపై కీలక మార్పులు తీసుకురావడానికి రిజర్వ్‌ బ్యాక్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.డిజిటల్ పేమెంట్స్‌‌ను కొనసాగించాలంటే..దానికి అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేననిమల్హోత్రా స్పష్టం చేశారు.  ప్రస్తుతం UPI సేవలను సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న కేంద్రం ఈ డిజిటల్ సేవలపై భవిష్యత్తులో ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.‌ డిజిటల్ పేమెంట్స్‌లో సర్వర్ ఖర్చులు. సైబర్ సెక్యూరిటీకి భారీ ఖర్చు అవుతోందని మల్హోత్రా అన్నారు. ఇందుకు తగినట్లే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్’కు సవరణలు చేయనున్నట్లు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత చట్టపరమైన మార్పు ద్వారా యూపీఐ లావాదేవీలకు సైతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

Also Read : వామ్మో : స్కూటర్ ధర రూ. 50 వేలు.. చలనా మాత్రం లక్ష రూపాయలు!

రూ.2,000 పైబడిన లావాదేవీలపైనే..

కాగా, కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం..2 వేలకుపైగా వ్యాపార UPI లావాదేవీలకు MDR విధించే అవకాశం ఉంది. అంటే ఒక్కో లావాదేవీలపై 0.3 శాతం నుండి 0.5 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రకారం లావాదేవీపై  సుమారు రూ.6 నుంచి రూ.10 వరకు ఛార్జీ పడే అవకాశం ఉంది. అదే సమయంలో  వ్యక్తుల మధ్య జరిగే UPI ట్రాన్సెక్షన్స్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవని సమాచారం.

అదే సమయంలో ఈ భారం సామాన్యులపై పడకుండా కేవలం రూ.1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారులపై మాత్రమే పడేలా డిజైన్ చేశారు. దీనివల్ల సాధారణ వినియోగదారులపై గానీ, వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులపై గానీ ఎలాంటి అదనపు భారం పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.. మరోవైపు వార్షిక టర్నోవర్ ఆధారంగా కూడా ఛార్జీలను నిర్ణయించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.ఇప్పటికే MDR కలెక్ట్ చేయడానికి లోక్‌సభలో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టడంతో అది అమల్లోకి వస్తే కోట్లాది వ్యాపార UPI లావాదేవీలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

Also Read : ఎయిర్ టర్బ్యులెన్స్ అంటే ఏంటీ?

ఇంతకీ ఎండీఆర్ అంటే ఏంటంటే?

సాధారణంగా డిజిటల్ చెల్లింపు సేవలను వినియోగించుకున్నందుకు గాను బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు వ్యాపారులు చెల్లించే మొత్తాన్నే ఎండీఆర్ (MDR) అంటారు. కాగా, ఇప్పటికే క్రెడిట్ కార్డ్‌ లావాదేవీలపై వ్యాపారులు సాధారణంగా 1.5 శాతం వరకు ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లిస్తున్నారు.. డెబిట్ కార్డ్‌లపై కూడా కొంత రుసుము పడుతుంది. కానీ ఇప్పటివరకు యూపీఐకి ఎలాంటి ఛార్జీలు లేవు. దీనివల్లే ఇది వ్యాపారులకు, వినియోగదారులకు చేరువైంది. అయితే. ఇప్పుడు ఛార్జీల అంశంపై చర్చ మెుదలైన నేపథ్యంలో యూపీఐ యూజర్లకు కొంత నిరాశే అని పేర్కొనవచ్చు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.