Susmita Mukherjee :  జీవితంలో కష్టాలు రావడం ఎంతటివారికైనా సహజమే. అందుకు సినీ ప్రముఖులు అతీతం కాదు. ప్రముఖ నటి సుస్మితా ముఖర్జీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చాలా ఎమోషనల్ అవుతూ కీలక విషయాలు వెల్లడించారు. తన జీవితంలో అనుభవించిన ఆర్థిక నరకాన్ని ఆమె బయటపెట్టారు. సోషల్ మీడియాలో ఒక అభిమాని.. మేడమ్, మీరు మహిళలను కించపరిచే, సీ-గ్రేడ్ సినిమాల్లో ఎందుకు నటించారని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న తనను తీవ్రంగా కలిచివేసిందని సుస్మిత చెప్పుకొచ్చారు.

అలాంటి సినిమాల్లో నటించినందుకు తనకేమీ గర్వంగా లేదన్నారు సుస్మితా ముఖర్జీ . పరిస్థితుల వల్ల తన ఆత్మను అమ్ముకున్నానని ఎమోషనల్ అయ్యారు. అప్పుడు తన మనస్సాక్షి నన్ను క్షమించలేదన్నారు. ఇప్పుడు కూడా బాధగానే ఉందని కానీ, ఆ సమయంలో తనకు వేరే దారి లేకపోయిందనేదే నికార్సైన నిజమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితికి గల కారణాలను వివరిస్తూ.. 2002లో తమ సొంత మీడియా కంపెనీ ప్రయాస్ ప్రొడక్షన్ సాంకేతిక మార్పుల వల్ల ఘోరంగా నష్టపోయిందని తెలిపారు.

Also Read : అనవసరమైన కామెంట్లు ఆపండి… హృతిక్ రోషన్‌కు కంగన వార్నింగ్!

ఆ వ్యాపారంలో ఏకంగా రూ. కోటి వరకు అప్పులు మిగిలాయని, దాంతో కుటుంబం మొత్తం దివాళా తీసిందని వెల్లడించారు. రికవరీ ఏజెంట్లు రోజూ ఇంటికొచ్చి బూతులు తిడుతూ, వేధింపులకు గురిచేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో పిల్లలు చాలా చిన్నవాళ్లు కావడంతో ఇల్లు గడవడానికి, క్రెడిటర్ల అప్పులు తీర్చడానికి దొరికిన ప్రతీ పనిని, సినిమాను ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

అప్పులు తీర్చడంతో పాటు తన కుమార్తెను ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు పంపడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది. భర్త ఇండియాలోనే చదివిద్దామన్నా, తల్లిగా తన కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తాపత్రయంతో ఆ వ్యయాన్ని కూడా తనే భరించినట్లు చెప్పారు. 3 నుండి 4 ఏళ్ల పాటు తానూ, తన భర్తా రాత్రింబవళ్లు కష్టపడి ఆ రూ. కోటి అప్పును తీర్చేశామని, పిల్లలిద్దరూ ఇప్పుడు సొంత కాళ్లపై నిలబడటంతో ఆ రోజులు గుర్తొచ్చినా తనకేమీ బాధలేదని స్పష్టం చేశారు.

ఒక నటిగా ప్రతీసారి నచ్చిన కథలనే ఎంచుకునే వెసులుబాటు అందరికీ ఉండదని, ఇల్లు గడవడానికి ఆ చక్రంలో ఓ భాగం కావాల్సి వస్తుందని అన్నారు. అయితే, ప్రస్తుతం తన జీవితంలో స్థిరపడ్డానని, ఇకపై తన మనస్సాక్షికి నచ్చిన, గౌరవప్రదమైన పాత్రలను మాత్రమే చేస్తానని సుస్మితా ముఖర్జీ చెప్పుకొచ్చారు.

Also Read : ఆర్జీవీ, ఊర్మిళ సీక్రెట్ పెళ్లి.. బయటపెట్టిన మెగాస్టార్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.