Vishwanath And Sons :  వెంకీ అట్లూరి డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం విశ్వనాథ్ అండ్‌ సన్స్‌. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ భారీ అంచనాల నడుమ 2026 ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Also Read : సీఎం విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. సంగీత సంచలనం!

ఇందులో సూర్య సంజయ్ విశ్వనాథ్ అనే ఒక పెద్ద ధనవంతుడి పాత్రలో కనిపిస్తున్నారు. అంతా హ్యాపీగా సాగిపోతున్న ఆయన జీవితంలో, తన కొడుకుకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. సరైన డోనర్ కోసం సంజయ్ విదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడ మమితా బైజు అతని జీవితంలోకి వస్తుంది. సంజయ్ పట్ల ఆమె ప్రేమను పెంచుకోవడంతో కథ సరికొత్త మలుపు తీసుకుంటుంది.

ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలు, వయసు వ్యత్యాసంతో కూడిన ఒక ఆసక్తికరమైన ప్రేమకథ కీలక పాత్ర పోషించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్‌లో పెద్దగా హై-వోల్టేజ్ మాస్ మూమెంట్స్ లేనప్పటికీ, సినిమా ఎలా ఉండబోతోందో క్లియర్‌గా చూపించారు డైరెక్టర్ వెంకీ అట్లూరి.. మనుషులు గొడవల వల్ల విడిపోరు.. విడిపోయాక ఎలా మాట్లాడాలో తెలియక అని సూర్య చెప్పిన డైలాగ్ ట్రైలర్ లో ఆకట్టుకుంది.

కాగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి..

Also Read : ‘కొరియన్ కనకరాజు’ హిట్టు కొట్టాడా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.