SBI Clerk Notification 2026 : బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆశించేవారికి ఇది శుభవార్తనే చెప్పాలి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నూతన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 1538 జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 7 నుండి 27 వరకు జరగనుంది. అభ్యర్థులు SBI కెరీర్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. కేంద్ర, రాష్ట్ర, యూనియన్ టెరిటరీల అభ్యర్థులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి, నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Also Read : రూ.3 కోట్లు ఇవ్వాల్సిందే..లేదంటే చంపేస్తా.. నిశ్చితార్థం రద్దు కేసులో యువతి బెదిరింపులు

ఎంపిక ఎలాంటే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఎంపిక విధానంలో భాగంగా మొదట అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. అందులో ఉత్తిర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 2026లో నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో జరిగే మెయిన్స్ ఎగ్జామినేషన్‌ రాయాల్సి ఉంటుంది.

ఎగ్జామ్‌ ఎలా ఉంటుందంటే?

ఎస్‌బీఐ క్లర్క్ 2026 ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ను100 మార్కులకు నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనికి ఒక గంట సమయం ఇస్తారు. ఇందులో ఇంగ్లీష్ , న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మరో విషయం ఏంటంటే ఇందులో నెగటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది, అంటే ఒక తప్పు సమాధానం రాస్తే 0.25 మార్కులు కోత విధిస్తారు.

మెయిన్ ఎగ్జామ్..ఇలా

ఇక మెయిన్ ఎగ్జామ్ విషయానికి వస్తే, ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అభ్యర్థులు కనిష్ట మార్కులు సాధించాలి. క్వాలిఫైయింగ్ మార్కులు సెక్షన్ల వారీగా కాకుండా ఓవరాల్‌గా తీస్తారు. అంతేకాకుండా, దరఖాస్తు చేసుకున్న వారికి ఆ తర్వాత 10వ లేదా 12వ తరగతి ఆధారంగా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్‌ను పరీక్షించడానికి ఉద్ధేశించింది.

Also Read : నేషనల్ హ్యాండ్‌లూమ్ డే: ప్రధాని మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం గిఫ్ట్!

ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుకు అర్హతలు..

ఎస్‌బీఐ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసినవారు కనీసం 20 ఏళ్ల వయస్సు ఉండాలి. గరిష్ట వయస్సు 28 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ వర్గాలకు వయస్సు సడలింపు అవకాశంఉంటుంది.

దరఖాస్తు చేసుకునే విధానం..

అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెరీర్‌ https://sbi.bank.in వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో ఉన్న అంశాల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివిన తర్వాత ఫారమ్‌ను నింపి, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా సంబంధిత ఫీజు చెల్లించాలి.. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడం అవసరం.

దరఖాస్తు ఫీజు వివరాలు:

* ఓబీసీ: రూ.750, ఎస్సీ/ఎస్టీ: రుసుము లేదు

SBI క్లర్క్ విద్యార్హతలు

* అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని చేసి ఉండాలి
* ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) ఉన్న వారు తమ ఉత్తీర్ణత తేదీని ధృవీకరించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి
* డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ విధుల్లో చేరేలోపు తప్పకుండా తమ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
* SBI క్లర్క్ పరీక్షకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరం

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.