Andhra Pradesh: ప్రేమించానన్నాడు.. కాలేజీకి వెళ్లిన అమ్మాయిని తీసుకువెళ్లాడు. తీరా పెళ్లి చేసుకున్నాక రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించాడు. అంతవరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత భార్యనే తిరిగి ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు రూ. 12 లక్షల రూపాయలకు బేరం పెట్టాడు ఓ ప్రేమికుడు. ఈ ఉదంతం ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో తీవ్ర కలకలం రేపింది.

ఇంతకు ఏం జరిగిందంటే.. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన మధు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం యువతి ఏలూరులోని కాలేజీకి వెళ్లగా, మధు తన స్నేహితులతో కలిసి ఆమెను తీసుకెళ్లాడు. అనంతరం వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో వీరిద్దరికీ ప్రేమ వివాహం జరిగింది.

Also Read : విజయవాడలో రూ.100 కోట్ల భారీ స్కామ్…ఇంట్లో కూర్చొని లక్షల సంపాదన అని…

పెళ్లి తర్వాత భార్యాభర్తలను ఇంటికి పంపించినప్పటికీ, కుమార్తె జాడ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఇదే సమయంలో మధు తరఫు వ్యక్తులు యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి సంచలన డిమాండ్ పెట్టారు. మీ కుమార్తె మీకు కావాలంటే రూ. 12 లక్షలు ఇవ్వాలి.. తమపై ఎలాంటి కేసులు పెట్టకూడదు.. డబ్బు ఇస్తేనే అమ్మాయిని మీ ఇంటి ముందు దింపి వెళ్తాం అని బెదిరింపులకు దిగారు.

బిడ్డ క్షేమం కోసం తల్లిదండ్రులు రూ. 6 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధపడ్డా, డబ్బు ఇచ్చాక కూడా బిడ్డను ఇస్తారో లేదోనన్న అనుమానంతో ఈ దారుణాన్ని మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. యువకుడు మధు గతంలోనూ సదరు యువతిని వేధింపులకు గురిచేశాడని, 2025 డిసెంబర్ 6న నూజివీడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అతడిపై కేసు (Cr. No. 311/2025 – BNS సెక్షన్ల కింద) నమోదైనట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read : రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి..పోలీసుల తీరుపై అనుమానాలు?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.