
Vijayawada : ఏపీలోని విజయవాడలో భారీ స్కామ్ భయటపడింది. ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించవచ్చంటూ టోకరా వేసిన కేటుగాడు ఏకంగా రూ.100 కోట్లను జనాన్ని ముంచేశాడు. కొన్ని నెలల క్రితం విజయవాడ సత్యనారాయణపురంలో మాషల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో.. కంపెనీ ఏర్పాటు చేసిన పసుపులేటి అంకుశం మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి లక్షల్లో లాభం పొందండని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. వంటింట్లో వాడే స్కబ్బర్(పీచు) ప్యాడ్ ను తయారు చేసే కాంట్రాక్టు అంటూ జనానికి ఎర వేశాడు.స్కబ్బర్ తయారీ కు అయ్యే ముడి సరుకు మేమే ఇస్తాం ఎక్కువ ధరకు మేమే కొంటాం అని నమ్మబలికిన కేటుగాడు మాది రిజిస్టర్ కంపెనీ.. మీరుఎంత పెట్టుబడి పెడితే అంత లాభం అంటూ ఫుల్ పబ్లిసిటీ చేశాడు, ఇది నమ్మిన పలువురు ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో మాయగాడి మాటలు నమ్మి మాషా అల్లా కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.
Also Read : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యనే రూ. 12 లక్షలకు బేరం పెట్టాడు!
చాలామంది రూ.లక్ష నుంచి 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. వారందరికీ డబ్బులు కట్టిన సమయంలో ఫేక్ బాండ్ పేపర్లు ఇచ్చిన మోసగాడు అంకుశం ప్రతి నెల ఆదాయం పేరుతో కొంత మొత్తాన్ని తిరిగి బాధితుల ఖాతాల్లో జమ చేశాడు. ఇలా ఏపీ వ్యాప్తంగా 2 వేల మందికిపైగా డబ్బులు వసూలు చేశాడు. గత 2 నెలల నుంచి అంకుశం ప్రాడక్ట్ తీసుకెళ్లకుండా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు విజయవాడలోని ఆఫీసు దగ్గరకు చేరుకుని ఆరాతీయగా బోర్డు తిప్పేశారని తెలుసుకున్న బాధితులు లబోదిబో మంటున్నారు. తాము మోస పోయామని గమనించిన బాధితులుసత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొన్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తమ డబ్బు తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Also Read : మెడికో స్టూడెంట్ ప్రియాంక మృతి









