Weather Alert: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పడ్డ ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావం వల్ల రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. హైదరాబాద్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Also Read: నీట్ పేపర్ లీక్ వెనుక బ్యుటీషియన్.. వెలుగులోకి సంచలన నిజాలు

Heavy Rain Alert In Telangana

ఓ వైపు వర్ష సూచన ఉన్నప్పటికీ మరోవైపు ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అలెర్ట్‌గా ఉండాలంటూ పలు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌, జగిత్యాల జిల్లాలకు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే ఛాన్స్ ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

Also Read: విజయ్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుంది.. మళ్లీ స్టాలినే సీఎం : DMK MLA సంచలన కామెంట్స్!